Share News

Vitamin D Deficiency: చీటికిమాటికి కోప్పడుతున్నారా.. ఆ లోపం ఉన్నట్లే

ABN , Publish Date - Jul 05 , 2024 | 06:44 PM

మారుతున్న జీవన శైలి చాలా మంది ప్రవర్తనలో మార్పులు తెస్తోంది. ఒత్తిడికి గురై ఏం చేస్తున్నామో అన్న విషయాన్ని కూడా మరుస్తున్నారు కొందరు. చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ.. చిరాకుగా ఉంటూ, నిరాశకు లోనవుతూ ఉంటే శరీరంలో ఓ లోపం ఉన్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.

Vitamin D Deficiency: చీటికిమాటికి కోప్పడుతున్నారా.. ఆ లోపం ఉన్నట్లే

ఇంటర్నెట్ డెస్క్: మారుతున్న జీవన శైలి చాలా మంది ప్రవర్తనలో మార్పులు తెస్తోంది. ఒత్తిడికి గురై ఏం చేస్తున్నామో అన్న విషయాన్ని కూడా మరుస్తున్నారు కొందరు. చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ.. చిరాకుగా ఉంటూ, నిరాశకు లోనవుతూ ఉంటే శరీరంలో ఓ లోపం ఉన్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. మాటిమాటికి కోప్పడుతున్న వారి శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది.

అకస్మాత్తుగా కోపం రావడం, నిరాశ, చిరాకు, ఏడవడం, ఒత్తిడికి గురి కావడం ఇవన్నీ విటమిన్ డి లోపానికి కారణాలే. డి విటమిన్ సరిపడినంత లేకపోతే కీళ్లు, ఒళ్ల నొప్పులు, బలహీనత, మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. అలాంటప్పుడు తప్పకుండా మీ శరీరంలో ఉన్న విటమిన్ డి పాళ్లను చెక్ చేసుకోవాలి. శరీరంలో ఈ విటమిన్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. వర్షాకాలం, చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లలో శరీరంలో విటమిన్ డి(Vitamin D Deficiency) తగ్గే అవకాశం ఉంది.


విటమిన్ డి లోపం లక్షణాలు..

  • రోజంతా అలసట

  • మనసు ప్రశాంతంగా లేకపోవడం, నిరాశ

  • కండరాల నొప్పి, బలహీనత

  • ఎముకల నొప్పి

  • ఎముకలు వంగిపోవడం

  • కీళ్ల నొప్పులు (ముఖ్యంగా వెన్నులో)

  • శరీర నొప్పి, తిమ్మిర్లు రావడం

శరీరంలో విటమిన్ డి ఏ స్థాయిలో ఉండాలి?

  • మిల్లీలీటర్‌కు 50 నానోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

  • మిల్లీలీటర్‌కు 20 నానోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఆరోగ్యానికి సరిపడుతుంది.

  • మిల్లీలీటర్‌కు 12 నానోగ్రాములు లేదా అంతకంటే తక్కువ ఉంటే శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.

  • మిల్లీలీటర్‌కు 20 నానోగ్రాముల కంటే తక్కువగా ఉంటే అది తేలికపాటి లోపంగా పరిగణిస్తారు.

  • మిల్లీలీటర్‌కు 10 నానోగ్రాముల కంటే తక్కువ ఉన్న వ్యక్తులు మితమైన లోపం కలిగి ఉంటారు.

  • మిల్లీలీటర్‌కు 5 నానోగ్రాముల కంటే తక్కువ ఉంటే తీవ్రమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు.


లోపాన్ని ఎలా అధిగమించాలి

శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉన్నవారు వైద్యుల సలహా మేరకు హెల్త్ సప్లిమెంట్లను తీసుకోవాలి. వీటితోపాటు ప్రతిరోజూ ఉదయం 9 గంటల వరకు సూర్యకాంతిలో నిలబడాలి. తద్వారా శరీరంలో సహజంగా విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. మీ ఆహారంలో పాల ఉత్పత్తులు, ఆకుకూరలను చేర్చుకోండి. తద్వారా విటమిన్ డి లోపాన్ని తగ్గించవచ్చు.

For Latest News and National News click here

Updated Date - Jul 05 , 2024 | 06:44 PM