Share News

Ghee Coffee: నెయ్యి కాఫీ బరువు తగ్గడంలో నిజంగా సహాయపడుతుందా..

ABN , Publish Date - Oct 23 , 2024 | 07:27 PM

ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి చాలా రకాల మార్గాలు అనుసరిస్తున్నారు. వాటిలో నెయ్యి కాఫీ చాలా వైరల్ అవుతోంది.

Ghee Coffee: నెయ్యి కాఫీ బరువు తగ్గడంలో నిజంగా సహాయపడుతుందా..
Ghee Coffee

నెయ్యి భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ నెయ్యిని ఆహారంలో తీసుకుంటారు. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు, పేగు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. బరువు తగ్గడంలో కూడా నెయ్యి సహాయపడుతుందని చెబుతారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో నెయ్యి కాఫీ చాలా వైరల్ అవుతోంది. నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని అంటున్నారు. అయితే నెయ్యి కాఫీ బరువు తగ్గడంలో నిజంగానే హెల్ప్ చేస్తుందా? అసలు నెయ్యి కాఫీని ఎలా తయారుచేస్తారు తెలుసుకుంటే..

Egg Mayonaise: కోడిగుడ్డు మయోనైస్ ను బ్యాన్ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచన.. ఎందుకంటే..


నెయ్యి కాఫీని పాలతో తయారు చెయ్యరు. కొద్ది మొత్తంలో నెయ్యిని బ్లాక్ కాఫీలో కలుపుతారు. దీన్ని ఉదయాన్నే తాగుతారు. సెలబ్రిటీలు ఫిట్ నెస్ డైట్ లో భాగంగా నెయ్యి కాఫీ తీసుకుంటారని అంటున్నారు.

ప్రముఖ ఇంటిగ్రేటివ్ లైఫ్ స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిలో తాజాగా నెయ్యి కాఫీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. "శరీరంలో కొవ్వు తగ్గడానికి షార్ట్ కట్ లు లేవు" అని చెప్పుకొచ్చాడు. బరువు తగ్గాలంటే ఆహారం తీసుకునే విషయంలో తెలివిగా ఉండాలని ఆయన అన్నారు. ఆహారం తీసుకోవడమే కాదు.. శారీరక కదలికలు కూడా మెరుగ్గా ఉండాలని, లోతైన శ్వాస వ్యాయామాలు కూడా ఇందుకు దోహదపడతాయని ఆయన చెప్పాడు. తేలికగా బరువు తగ్గాలనే ఆలోచనతో షార్ట్ కట్ మార్గాలను అనుసరించడం, సోమరితనాన్ని పెంచే దిశగా ఆలోచించడం మానేయడం మంచిదని హితవు పలికాడు.

Moringa Rice: ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచే మునగాకు రైస్.. చాలా రుచిగా ఇలా చేసేయండి..


బరువు తగ్గాలంటే బాగా పనిచేయాలి, ప్రవర్తనను మార్చుకోవాలని ఆయన అన్నారు. చాలామంది నెయ్యి కాఫీ వల్ల తమకు ఆహార కోరికలు కొన్ని గంటల వరకు ఉండటం లేదని చెప్పడం పట్ల ఆయన స్పందిస్తూ.. "ఆహారం తినాలని అనిపించకపోవడం అనేది తాత్కాలికమే.. కొన్ని గంటల తరువాత మళ్లీ ఆహారం తినాలని అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? దీనికోసం నెయ్యి కాఫీకి బదులు ప్రోటీన్ ఆహారం కూడా తీసుకోవచ్చు. ప్రోటీన్ తీసుకుంటే కొన్ని గంటల వరకు శరీరానికి ఆహారం అవసరం ఉండదు. అందుకే బరువు తగ్గాలంటే మొదటగా ఆలోచనలు మార్చుకోవాలి" అని సూచించాడు. కాబట్టి బరువు తగ్గే అలోచన ఉన్నవారు ఇలాంటి షార్ట్ కట్ మార్గాలను ఎంచుకోకుండా శారీరక శ్రమను పెంచడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్లానింగ్ గా తీసుకోవడం, బరువు తగ్గడం గురించి ఆలోచనలు మార్చుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి..

Oats Vs Daliya: ఓట్స్ లేదా గోధుమ నూక.. బరువు తగ్గడానికి ఏది మంచిదంటే..

రుచికరమైన మునగాకు రైస్.. ఇలా చేస్తే అదుర్స్..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 23 , 2024 | 07:27 PM