Share News

Health Tips: రోజువారీ జీవితంలో ఈ 6 మార్పులు చేసుకుంటే చాలు.. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది..!

ABN , Publish Date - Aug 17 , 2024 | 04:01 PM

క్యాన్సర్ ను నయం చేసే దిశగా వైద్యశాస్త్రం అభివృద్ది చెందుతున్నా అది ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల సామాన్యులు క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే ఇక మరణం తప్పదనే అభిప్రాయంలోకి జారిపోతున్నారు. అయితే..

Health Tips: రోజువారీ జీవితంలో ఈ 6 మార్పులు  చేసుకుంటే చాలు..  క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది..!
cancer

ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలను బలితీసుకుంటున్న వ్యాధులలో క్యాన్సర్ మహమ్మారి రెండవ స్థానంలో ఉంది. ఒకప్పుడు క్యాన్సర్ చాలా అరుదుగా వచ్చే వ్యాధి కోవలో ఉండేది. కానీ ఇప్పుడు క్యాన్సర్ కు సంబంధించి చాలా కేసులు వెలుగు చూస్తున్నాయి. క్యాన్సర్ ను నయం చేసే దిశగా వైద్యశాస్త్రం అభివృద్ది చెందుతున్నా అది ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల సామాన్యులు క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే ఇక మరణం తప్పదనే అభిప్రాయంలోకి జారిపోతున్నారు. అయితే రోజువారీ జీవనశైలిలో 6 మార్పులు చేసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుకుంటే..

Milk: రాత్రిపూట పాలు తాగే అలవాటుందా? ఈ సమస్యలు ఉన్నవారు తాగకూడదట..!



ఆహారం..

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుండి, వాపుల నుండి శరీర కణాలను కాపాడతాయి. ప్రతిరోజూ పండ్లను ఆహారంలో తీసుకుంటే ఊపిరితిత్తులు, నోరు, గొంతు, కడుపుతో సహా చాలా క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది.

వ్యాయామం..

మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో వ్యాయామం ప్రభావవంతంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి శరీర కణజాలల మీద ప్రభావం చూపించే వ్యాధులు రాకుండా చేయడంలో వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హార్మోన్లను క్రమబద్ధీకరించవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అదే విధంగా బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇవన్నీ రొమ్ము, పెద్ద ప్రేగు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామం ఉండేలా చూసుకోవాలి.

Skin Care: రాత్రిపూట ఈ టిప్స్ పాటిస్తే చాలు.. వయసు పెరిగినా చర్మం బిగుతుగా యవ్వనంగా ఉంటుంది..!



మద్యం..

మద్యం ఎక్కువ తీసుకోవడం వల్ల రొమ్ము, కాలేయం, అన్నవాహిక వంటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ డిఎన్ఏ ను దెబ్బతీస్తుంది. అందుకే మద్యం తీసుకోవడం మానేయాలి.

ధూమపానం..

ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కు పొగాకు తీసుకోవడం ప్రధాన కారణం అని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యక్ష ధూమపానమే కాదు పరోక్ష ధూమపానం కూడా హానికారం. ధూమపానం మానేయాలి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండాలి.

White Hair: హెన్నాలో ఈ రెండు మిక్స్ చేసి రాస్తే చాలు.. తెల్ల జుట్టుకు రంగు వెయ్యక్కర్లేకుండా నల్లగా అవ్వుద్ది..!



చెకప్..

క్యాన్సర్ అనేది చాపకింద నీరులా శరీరంలోకి మెల్లగా చొచ్చుకుని పోతుంది. ఇది మొదట్లో బయట పడదు. ఇది బయట పడే సమయానికి పరిస్థితి చెయ్యి దాటిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే క్యాన్సర్ చెకప్ లు అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండాలి. మామోగ్రామ్ లు, పాప్ స్మెర్స్, కొలనోస్ఖీపీలు వంటి సాధారణ స్క్రీనింగ్ లు వరుసగా రొమ్ము, గర్భాశయం, పెద్ద ప్రేగు క్యాన్సర్ లను గుర్తించడంలో సహాయపడతాయి.

స్కిన్ క్యాన్సర్..

స్కిన్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ అత్యంత సాధారణ రకాల్లో ఒకటి. అయితే ఇది నివారించదగినది. సూర్యుని నుండి వెలువడే హానికరమైన అతినీల లోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవాలి. నిద్రించే ప్రాంతాల నుండి, ధరించే దుస్తులు, చర్మ సంరక్షణ కోసం వాడే ఉత్పత్తులు అన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.

ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!

త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 17 , 2024 | 04:01 PM