Health Tips: ధీర్ఘాయువు కోసం ఈ 3 విటమిన్లు తప్పనిసరి.. అవేంటంటే..
ABN , Publish Date - Jun 23 , 2024 | 03:43 PM
దీర్ఘకాలం జీవించాలని ఎవరికి మాత్రం అనిపించదు. అందుకే.. సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయుష్షును పెంచుకోవడానికి ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేస్తుంటారు. అయితే, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మారుతున్న జీవనశైలి కారణంగా, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా..
Health News: దీర్ఘకాలం జీవించాలని ఎవరికి మాత్రం అనిపించదు. అందుకే.. సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయుష్షును పెంచుకోవడానికి ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేస్తుంటారు. అయితే, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మారుతున్న జీవనశైలి కారణంగా, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా.. రసాయనాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ప్రజల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. అందుకే.. జీవనశైలిని సరిగా నిర్వహించాలని.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా మనం తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. విటమిన్లు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ముఖ్యంగా 3 విటమిన్లు దీర్ఘాయుకు ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విటమిన్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
1. విటమిన్ డి
విటమిన్ డి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మెరుగైన రోగనిరోధక శక్తికి విటమిన్ డి సహాయపడుతుంది. ఈ కారణంగానే వైద్యులు ఎక్కువగా విటమిన్ డి తీసుకోవాలని సూచిస్తుంటారు. వాస్తవానికి, విటమిన్ డి రోగనిరోధక శక్తికి చాలా మంచిది. బలమైన ఎముకలు, మంచి మానసిక స్థితిని నిర్వహించడానికి విటమిన్ డి చాలా ముఖ్యమైనది. విటమిన్ డి మన జీవితకాలాన్ని పెంచడమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధుల నుండి రక్షిస్తుంది. విటమిన్ డి తగినంత ఉంటే.. క్యాన్సర్, ఆటో-ఇమ్యూన్ వ్యాధులు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ డి సాంప్రదాయకంగా సూర్యకాంతి ద్వారా వస్తుంది. ఆహారం ద్వారా అయితే చేపలు, చేపల కాలేయంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అలాగే గుడ్లు, చీజ్, గొడ్డు మాంసం కాలేయంలో కూడా ఉంటుంది.
2. విటమిన్ సి
విటమిన్ డి తో పాటు.. శరీరానికి అత్యంత ముఖ్యమైన రెండవ విటమిన్.. విటమిన్ సి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కరోనా సమయంలో విటమిన్ సి తీసుకోవాలని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. మెడికల్ జర్నల్స్ ప్రకారం.. విటమిన్ సి వినియోగం గుండె సంబంధిత వ్యాధులు, వివిధ క్యాన్సర్లు, వృద్ధాప్యంలో తలెత్తే లక్షణాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి.. బ్రోకలీ, క్యాప్సికమ్, కివి, సిట్రస్ పండ్లు, బెర్రీలలో పుష్కలంగా ఉంటుంది.
3. విటమిన్ ఇ
డి, సి విటమిన్‌తో పాటు.. శరీరానికి అత్యంత ప్రయోజనకరమైన విటమిన్ విటమిన్ ఇ. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది శరీర కణాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును నివారించడంలో సహాయపడతాయి. ఇవి వృద్ధాప్య కారకాలను నియంత్రిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మం, రోగనిరోధక శక్తి, ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ ఇ చాలా ముఖ్యం. విటమిన్ ఇ తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరవు. వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్, బచ్చలికూర, కూరగాయల నూనెలు, తృణ ధాన్యాలలో విటమిన్ ఇ ఉంటుంది.