Share News

Health Tips: ఈ ఆహారాలు తిన్నారంటే.. కీళ్ల నొప్పులు తగ్గడమే కాదు.. పరిగెట్టేంత బలం వస్తుంది..!

ABN , Publish Date - Jul 24 , 2024 | 04:02 PM

కీళ్ల నొప్పులు ఒకప్పుడు వయసైపోయిన వారిలో మాత్రమే కనిపించేవి. మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం, ఎముకలు బలహీనంగా మారడం వల్ల కీళ్ల నొప్పులు వస్తుంటాయి. కానీ నేటి కాలంలో చిన్న వయసు వారిలోనూ కీళ్ల నొప్పులు అనే మాట వినబడుతోంది.

Health Tips:  ఈ ఆహారాలు తిన్నారంటే.. కీళ్ల నొప్పులు తగ్గడమే కాదు.. పరిగెట్టేంత బలం వస్తుంది..!
Joint Pains

కీళ్ల నొప్పులు ఒకప్పుడు వయసైపోయిన వారిలో మాత్రమే కనిపించేవి. మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం, ఎముకలు బలహీనంగా మారడం వల్ల కీళ్ల నొప్పులు వస్తుంటాయి. కానీ నేటి కాలంలో చిన్న వయసు వారిలోనూ కీళ్ల నొప్పులు అనే మాట వినబడుతోంది. సరైన ఆహారం, శారీరక శ్రమ ఎక్కువ లేకపోవడం, ఎముకలు, కీళ్లకు హాని చేసే ఆహారాలు, అలవాట్లు ఉండటం వల్ల ఈ సమస్య వస్తోంది. అయితే కీళ్లను బలంగా మార్చడానికి ఆహారాలతో మ్యాజిక్ చేయవచ్చు. కింద ఇచ్చిన ఆహారాలు రోజూ తీసుకుంటూ ఉంటే కీళ్ల నొప్పులు పోయి తొందర్లోనే పరిగెట్టేంత బలం వచ్చేస్తుంది. అవేంటో తెలుసుకుంటే..

అరోమా థెరపీ గురించి విన్నారా? దీంతో లాభాలేంటంటే..!


  • కీళ్ల నొప్పులు తగ్గడానికి ఫ్యాటీ ఫిష్ ఉత్తమ ఆహారం. ఫ్యాటీ ఫిష్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి కీళ్లకు మంచివి. కీళ్ల భాగంలో గుజ్జు ఉత్పత్తి కావడానికి, ఎముకలు బలంగా మారడానికి ఇవి సహాయపడతాయి.

  • చాలామంది ఆరోగ్యకర ఆహారంలో భాగంగా తీసుకునే బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలలో ఒమెగా-3 ప్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయి.

  • బెర్రీ జాతికి చెందిన పండ్లైన బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీస్, బ్లాక్బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల వాపును, కీళ్ల నొప్పులను తగ్గించడంలో అద్బుతంగా సహాయపడతాయి.

  • ఆకుకూరలు కూడా కీళ్ల ఆరోగ్యానకి మేలు చేస్తాయి. ముఖ్యంగా బచ్చలికూర, పాలకూర వంటి ఇతర ఆకుకూరలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. కీళ్లలో కణజాలం ఉత్పత్తి కావాలంటే కొల్లాజెన్ చాలా అవసరం. ఈ కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయడంలో ఆకుకూరలు ప్రధానపాత్ర పోషిస్తాయి.

మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!


  • ఆరోగ్యకరమైన ఆహారంలో బ్రోకలీ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ గా పరిగణించబడుతుంది. బ్రోకలిలో సల్పోరాఫేన్ అధికంగా ఉంటుంది. ఇది కీళ్ల సమస్యలు పెరగకుండా చేస్తుంది.

  • వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే పసుపు కూడా కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని వంటల్లోనే కాకుండా పసుపు పాలు, పసుపు టాబ్లెట్లను వైద్యుల సలహాతో వాడితే మంచిది.

  • అల్లం, వెల్లుల్లి ఇప్పట్లో చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఉండే జింజెరాల్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో, కీళ్ల పట్టుత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇక వెల్లుల్లిలో డయల్ డైసల్పైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కీళ్లలో మృదులాస్థి నష్టాన్ని తగ్గించి కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మార్కెట్లో దొరికే A1, A2 నెయ్యి మధ్య తేడాలేంటి?

ఈ కెరాటిన్ ఫుడ్స్ తింటే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 24 , 2024 | 04:02 PM