Share News

Heart Health: ఈ ఆహారాలు తింటే చాలు.. మీ గుండె 60 ఏళ్లలోనూ 20 ఏళ్లలా పనిచేస్తుంది..!

ABN , Publish Date - Jul 23 , 2024 | 12:46 PM

ప్రపంచంలో అధిక శాతం మరణాలకు కారణం అవుతున్న వాటిలో మొదటి స్థానంలో ఉన్నది గుండె జబ్బులే. గుండెపోటు, గుండె వైఫల్యం, గుండె పనితీరులో సమస్యలు మొదలైవని మరణానికి కారణం అవుతున్నాయి. నేటికాలంలో అయితే చిన్న వయసు వారిలో కూడా గుండె వైఫల్యం, స్ట్రోక్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి.

Heart Health:   ఈ ఆహారాలు తింటే చాలు..  మీ గుండె 60 ఏళ్లలోనూ 20  ఏళ్లలా పనిచేస్తుంది..!

ప్రపంచంలో అధిక శాతం మరణాలకు కారణం అవుతున్న వాటిలో మొదటి స్థానంలో ఉన్నది గుండె జబ్బులే. గుండెపోటు, గుండె వైఫల్యం, గుండె పనితీరులో సమస్యలు మొదలైవని మరణానికి కారణం అవుతున్నాయి. నేటికాలంలో అయితే చిన్న వయసు వారిలో కూడా గుండె వైఫల్యం, స్ట్రోక్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుండగానే మృత్యు ఒడిలోకి జారుకుంటున్న యువత చాలామంది ఉన్నారు. అయితే కొన్ని ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల 60 ఏళ్ల వయసు వచ్చినా సరే.. 20 ఏళ్ల వయసున్న వారిలా గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఆ ఆహారాలేంటో తెలుసుకుంటే..

Brain Health: మీ మెదడు బలహీనంగా ఉందని చెప్పే 5 లక్షణాలు ఇవీ.. వెంటనే చెక్ చేసుకోండి..!



అల్లం, వెల్లుల్లి..

అల్లం, వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ ఫలకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణ, రక్తపోటును నియంత్రిస్తుంది. అల్లంలో ఉండే జింజెరోల్స్, షోగోల్స్ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించి ధమనులను శుభ్రం చేస్తాయి.

పసుపు..

పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతరమైన రసాయనం ఉంటుంది. ఇది మంటను తగ్గిస్తుంది. ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా ధమనులలో ఫలకం పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ధమనులను శుభ్రంగా ఉంచుతాయి. దీన్ని రెగ్యులర్ గా వాడుతుంటే కొంత కాలంలోనే గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.

Walking: ఈ వాకింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు.. ఈజీగా బరువు తగ్గచ్చు..!



ఉసిరికాయ..

ఉసిరికాయ గుండెకు మేలు చేస్తుంది. ఉసిరిలోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ధమనులలో ఫలకం పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు ఉసిరికాయ తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.

అశ్వగంధ..

ఆయుర్వేదంలో అశ్వగంధకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది ఒత్తిడిని తగ్గించే ప్రసిద్ధ ఆయుర్వేద మూలిక. గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. వ్యాధులను దూరం చేస్తుంది. గుండె ధమనులు శుభ్రంగా ఉండటంలో సహాయపడుతుంది.

గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయల లిస్ట్ ఇదీ..!

రక్తంలో చక్కెరను, చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించే నేచురల్ డ్రింక్స్ ఇవి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 23 , 2024 | 12:46 PM