Share News

Heart Health: ఈ మూలికలు తినండి చాలు.. గుండె జబ్బులు రానే రావు..!

ABN , Publish Date - Jun 22 , 2024 | 08:14 PM

మానవ శరీరంలో ప్రధాన అవయం గుండె. గుండె పనితీరుపైనే మనిషి ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. అయితే నేటి కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. కొందరు చిన్న వయసులోనే గుండె జబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండె జబ్బులకు అడ్డుకట్ట వేసే మూలికలు కొన్ని ఉన్నాయి.

Heart Health: ఈ మూలికలు తినండి చాలు..  గుండె జబ్బులు రానే రావు..!

మానవ శరీరంలో ప్రధాన అవయం గుండె. గుండె పనితీరుపైనే మనిషి ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. అయితే నేటి కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. కొందరు చిన్న వయసులోనే గుండె జబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండె జబ్బులకు అడ్డుకట్ట వేసే మూలికలు కొన్ని ఉన్నాయి. వీటిని తింటూ ఉంటే అస్సలు గుండె జబ్బుల సమస్యలు ఏవీ మిమ్మల్ని టచ్ చేయవు. ఇంతకీ ఆ మూలికలేంటో తెలుసుకుంటే..

వేప..

వేప ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వేప ఆకులు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతంగా సహాయపడతాయి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ రెమ్మ వేపాకులు నమిలి తింటే మంచిది.

ముఖం, చర్మం మీద ఈ లక్షణాలుంటే మూత్రపిండ సమస్యలు ఉన్నట్టే..!


సరస్వతి..

సరస్వతి ఆకులనే బ్రహ్మీ ఆకులు అని అంటారు. సరస్వతి ఆకులను, టాబ్లెట్లను, చూర్ణాన్ని ఇలా చాలా రకాలుగా వాడతారు. ఇది విద్యార్థులకు మేధో శక్తి పెరగడంలో, మెదడు పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుందని అంటారు. సరస్వతి ఆకులను ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తింటూంటే హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అల్లం ఆకులు..

అల్లం రక్తపోటు, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుందని అందరికీ తెలుసు. అయితే కేవలం అల్లం మాత్రమే కాదు.. అల్లం ఆకులు కూడా గుండె ఆగిపోకుండా నిరోధించడంల సహాయపడతాయి. అల్లం ఆకులను ఆహారంలో, టీలలో భాగంగా తీసుకుంటూ ఉంటూ ఉండాలి.

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!


అర్జున ఆకులు..

సాంప్రదాయ వైద్యంలోనూ, ఆయుర్వేదంలోనూ అర్జున చెట్టు బెరడు, ఆకులు బాగా ఉపయోగిస్తుంటారు. అర్జున చెట్టు ఆకులు గుండె కండరాలను బలోపేతం చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

తులసి ఆకులు..

తులసికి ఆయుర్వేదంలో గొప్ప స్థానం ఉంది. ఇది యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. తులసి ఆకులను వాడటం వల్ల ఆరోగ్యకరమైన రక్తప్రసరణ ఉంటుంది. ఇది గుండె పనితీరుకు సమర్థవంతంగా సహాయపడుతుంది.

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!

ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 22 , 2024 | 08:14 PM