Share News

Mustard Oil: ఆవాల నూనె ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా? మీకు తెలియని నిజాలివీ..!

ABN , Publish Date - Jul 25 , 2024 | 03:28 PM

కొన్ని రాష్ట్రాలలో వంటల్లో సన్ ఫ్లవర్, వేరుశనగ వంటి నూనెలకు బదులుగా ఆవాల నూనె, నువ్వుల నూనె వంటివి ఉపయోగిస్తారు. ఇవి వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా చేకూర్చుతాయి. ముఖ్యంగా ఆవాల నూనెను..

Mustard Oil: ఆవాల నూనె ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా? మీకు తెలియని నిజాలివీ..!
Mustard Oil

వంటలు తయారు చేయడానికి తప్పనిసరిగా నూనె ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో నూనె ఎక్కువగా వినియోగిస్తుంటారు. కొన్ని రాష్ట్రాలలో వంటల్లో సన్ ఫ్లవర్, వేరుశనగ వంటి నూనెలకు బదులుగా ఆవాల నూనె, నువ్వుల నూనె వంటివి ఉపయోగిస్తారు. ఇవి వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా చేకూర్చుతాయి. ముఖ్యంగా ఆవాల నూనెను వంటల్లోనే కాకుండా వైద్యంలోనూ, ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. ఆవాలనూనె గురించి చాలామందికి తెలియని నిజాలేంటంటే..


  • కొందరికి ఆకలి లేమి సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఏం తినమని చెప్పినా ఆకలి లేదు అంటూ ఉంటారు. అలాంటి వారికి ఆవనూనెతో వండిన ఆహారపదార్థాలు ఇవ్వాలి. ఆవనూనెలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఆకలిని పెంచడంలో సహాయపడుతుంది. ఆకలి హార్మోన్లు సమతుల్యం అవుతాయి.

  • ఆవనూనెతో వండిన వంటలు తింటే అది కేవలం రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు నయం అవుతాయి. మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడేవారికి చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

  • ఆవాలు వేడి చేసే గుణం కలిగి ఉంటాయి. ఈ నూనెను వంటల్లో వాడినా లేదా ఈ నూనెతో శరీరానికి మసాజ్ చేసినా శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఇక శరీర కండరాలు కూడా బలంగా మారతాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఎముకలకు సంబంధించి ఆస్థియోపోరోసిస్ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఆవాల నూనెను వాడితే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఆవాలనూనె వాడటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.

వైద్యులు చెప్పిన నిజాలు.. ఈ ఆల్కహాల్ రకాలు చాలా హెల్తీ..!


  • చర్మ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఆవాల నూనె చక్కగా సహాయపడుతుంది. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. ముఖం మీద మొటిమలు, ముడతలు, పొడిచర్మం వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

  • జుట్టు పలుచగా, రాగి రంగులో ఉన్నవారు ఆవాల నూనెను జుట్టుకు ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆవాల నూనె జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి, జుట్టుకు మెరుపు అందించడంలోనూ ప్రభావవంతంగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారికోసం భలే టిఫిన్లు.. వీటిలో కేలరీలు చాలా తక్కువ..!

మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 25 , 2024 | 03:32 PM