Share News

Raisin water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష నీరు తాగడం వల్ల ఏం జరుగుతుంది? ఈ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - May 20 , 2024 | 04:36 PM

ఉదయాన్నే సాధారణ నీటికి బదులుగా ఎండుద్రాక్ష నీటిని తాగితే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయి. ఎండుద్రాక్ష పోషకాల పవర్‌హౌస్. ఇందులో ప్రొటీన్‌, ఐరన్‌, ఫైబర్‌ ఉంటాయి. అలాగే విటమిన్ B6, కాల్షియం, పొటాషియం, కాపర్ కూడా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.

Raisin water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష నీరు తాగడం వల్ల ఏం జరుగుతుంది? ఈ నిజాలు తెలిస్తే..!

చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో సాధారణ నీటిని తాగుతారు. మరికొందరు వేడినీరు తాగుతారు. తద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ మూత్రం, మలం సహాయంతో బయటకు వెళ్లిపోతాయి. కానీ సాధారణ నీటికి బదులుగా ఎండుద్రాక్ష నీటిని తాగితే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయి. ఎండుద్రాక్ష పోషకాల పవర్‌హౌస్. ఇందులో ప్రొటీన్‌, ఐరన్‌, ఫైబర్‌ ఉంటాయి. అలాగే విటమిన్ B6, కాల్షియం, పొటాషియం, కాపర్ కూడా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఎండు్ద్రాక్ష నీరు ఎలా తయారుచేసుకోవాలి? ఈ నీటిని తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

ఎండుద్రాక్ష నీరు..

ఎండుద్రాక్షను శుభ్రమైన గాజు, లేదా కంటైనర్‌లో ఉంచాలి. ఎండుద్రాక్ష మునిగేలా నీరు పోయాలి. కంటైనర్ మీద మూత వేయాలి. రాత్రిపూట ఇలా చేసి ఉదయం వరకు వదిలేయాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడానికి ఎండుద్రాక్ష నీరు సిద్దం.

బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!


ప్రయోజనాలు..

ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరుగుతాయని, మెదడు పనితీరు మెరుగుపడుతుందని నమ్ముతారు.

ఎండుద్రాక్ష నీరు ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత వంటి పరిస్థితులను నివారిస్తుంది. అలసట, శ్వాసలోపం, చర్మం సున్నితంగా మారడం, బలహీనత రక్తహీనత ఉన్నవారిలో ఉండే లక్షణాలు.

ఎండుద్రాక్షలో ఉండే విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఎండుద్రాక్ష నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల మీ చర్మం కూడా మెరుగుపడుతుంది. దీని వల్ల చర్మం మెరుపు రెట్టింపు అవుతుంది. ఇది మీ జుట్టుకు ఆరోగ్యకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. ఇది మీ శరీరాన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది. ఇది జీర్ణశక్తిని బలంగా ఉంచుతుంది.

చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!

బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 20 , 2024 | 04:36 PM