Share News

Vitamin-D: విటమిన్-డి లోపాన్ని త్వరగా నయం చేయాలంటే ఈ పానీయాలు తాగండి..!

ABN , Publish Date - Jun 19 , 2024 | 01:12 PM

విటమిన్-డి లోపం వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఎదురయ్యే సమస్య. ఆకాశం ఎక్కువగా మేఘావృతం అయ్యి సూర్యుడి కాంతి తక్కువగా ఉండటం వల్ల శరీరానికి తగినంత విటమిన్-డి లభించడదు. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే విటమిన్-డి లోపం ఏర్పడుతుంది.

Vitamin-D: విటమిన్-డి లోపాన్ని త్వరగా నయం చేయాలంటే ఈ పానీయాలు తాగండి..!

విటమిన్-డి లోపం వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఎదురయ్యే సమస్య. ఆకాశం ఎక్కువగా మేఘావృతం అయ్యి సూర్యుడి కాంతి తక్కువగా ఉండటం వల్ల శరీరానికి తగినంత విటమిన్-డి లభించడదు. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. విటమిన్-డి శరీరంలో కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. కాబట్టి విటమిన్-డి లేకపోతే కాల్షియం కూడా తగినంత అందదు. అయితే విటమిన్-డి లోపాన్ని నయం చేయడానికి కొన్ని పానీయాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుంటే..

హెర్బల్ టీలు..

దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనైస్ వంటి సుగంధ ద్రవ్యాలు జోడించి తయారుచేసే హెర్బల్ టీలు విటమిన్-డి లోపాన్ని భర్తీ చేయడంలో చక్కగా సహాయపడతాయి.

పచ్చిపాలు ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే..!


క్యారెట్ జ్యూస్..

క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మంచివిగా పేర్కొనబడతాయి. క్యారెట్ల జ్యూస్ రోజూ తాగుతుంటే విటమిన్-డి లోపం నయం అవుతుంది. కేవలం విటమిన్-డి లోపాన్ని నయం చేయడమే కాదు.. శరీరాన్ని రిఫ్రెష్ చేయడంలో కూడా క్యారెట్ జ్యూస్ చక్కగా సహాయపడుతుంది.

ఫోర్టిఫైడ్ మిల్క్..

సమతులాహారంలో పాలకు స్థానం ఉంది. ప్రతి రోజూ పాలు తీసుకుంటూ ఉంటే విటమిన్-డి శరీరానికి అందుతుంది.

స్మూతీస్..

స్మూతీస్ లో విటమిన్-డి పుష్కలంగా ఉంటాయి. ఆకుకూర, పాలకూర, కూరగాయలతో స్మూతీస్ తయారుచేసుకుని తీసుకోవడం మంచిది.

రక్తాన్ని శుద్ది చేసే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!


ప్లాంట్ బేస్డ్ మిల్క్..

సోయా, బాదం, ఓట్స్ మొదలైనవాటితో తయారుచేసిన పాలలో కూడా విటమిన్-డి ఉంటుంది. ఇవన్నీ మొక్కల ఆధారిత పాలుగా పరిగణించబడతాయి. ఈ పాలు తీసుకుంటే విటమిన్-డి లోపం తగ్గుతుంది.

ఆరెంజ్ జ్యూస్..

పండ్లలో ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్-డి సమృద్దిగా ఉంటుంది. అలాగే విటమిన్-సి కూడా ఉంటుంది. ప్రతిరోజూ తాజా ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా లేక ఆరెండ్ పండు తిన్నా విటమిన్-డి లోపాన్ని నయం చేయవచ్చు.

మష్రూమ్ టీ..

పుట్టగొడుగులను సాధారణంగా వంటలలో ఉపయోగిస్తారు. కానీ పుట్టగొడుగులను ఉపయోగించి టీ లేదా సూప్ తయారుచేసుకుని తీసుకోవడం వల్ల విటమిన్-డి లోపాన్ని నయం చేయవచ్చు.

పచ్చిపాలు ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే..!

రక్తాన్ని శుద్ది చేసే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 19 , 2024 | 01:12 PM