Share News

White Hair: ఈ 5 సూపర్ ఫుడ్స్ తినండి చాలు.. తెల్లజుట్టు మంత్రించినట్టు మాయమవుతుంది..

ABN , Publish Date - Oct 23 , 2024 | 05:36 PM

తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ 5 సూపర్ ఫుడ్స్ లో ఏ ఒక్కటి తింటున్నా చాలు..

White Hair: ఈ 5 సూపర్ ఫుడ్స్ తినండి చాలు.. తెల్లజుట్టు మంత్రించినట్టు మాయమవుతుంది..

వయసు పెరిగేకొద్ది తెల్లజుట్టు రావడం కామన్.  చాలామంది వృద్దాప్యానికి సూచికగా తెల్లజుట్టును పరిగణలోకి తీసుకుంటారు. కానీ నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడం వల్ల ఉండాల్సిన వయసు కంటే పెద్దగా కనబడుతుంటారు. పైగా తెల్లజుట్టును కవర్ చేయడానికి రసాయనాలున్న హెయిర్ డైలు,  షాంపూలు, హెయిర్ మాస్క్ లు వాడుతూ జుట్టును మరింత పాడు చేసుకుంటున్నారు. అయితే తెల్లజుట్టు సమస్యకు నేచురల్ గా చెక్ పెట్టాలంటే కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఈ ఆహారాలు జుట్టు తిరిగి నల్లగా మారడంలో సహాయపడతాయి.  కింది ఆహారాలలో ఏదో ఒకటి ప్రతి రోజూ తీసుకోవడం మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

Egg Mayonaise: కోడిగుడ్డు మయోనైస్ ను బ్యాన్ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచన.. ఎందుకంటే..


చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది..

డైటీషియన్ల ప్రకారం చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. 

  • జుట్టు పెరుగుదలకు, జుట్టు నల్లగా ఉండటానికి అవసరమైన సూక్ష్మపోషకాలు శరీరానికి అందకపోవడం వల్ల జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతుంది.

  • జుట్టు  ఎక్కువగా సూర్యరశ్మికి గురి కావడం కూడా తెల్ల జుట్టు వస్తుంది.

  • తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా కూడా తెల్లజుట్టు సమస్య వస్తుంది.

తెల్లజుట్టు సమస్య తగ్గాలంటే ఇవి తినాలి..

కలోంజి విత్తనాలు..

కలోంజి విత్తనాలు నువ్వులను పోలి ఉంటాయి.  ఇవి జుట్టు ఆరో్గ్యానికి చాలా మేలు చేస్తాయి. తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి. కలోంజి విత్తనాలను చాలా ప్రాంతాలలో ఆహారంలో చేర్చుకుంటారు.  వీటిని హెయిర్ మాస్క్ లాగా కూడా ఉపయోగించవచ్చు.  మెంతులతో కలిపి గ్రైండ్ చేసి తలకు అప్లై చేయాలి. వారానికి రెండు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Moringa Rice: ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచే మునగాకు రైస్.. చాలా రుచిగా ఇలా చేసేయండి..


ఉసిరి..

ఉసిరిని అమలకి అని అంటారు. ఉసిరి కాయను భారతీయులు గొప్ప సంపదగా భావిస్తారు. ఇది జుట్టు పెరుగుదలలోనూ, జుట్టు నల్లగా నిగనిగలాడటంలోనూ సహాయపడుతుంది. ఉసిరికాయలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు  హెయిర్ ఫోలికల్స్ లో ఉన్న సహజ నలుపు రంగున సంరక్షించడంలో సహాయపడుతుంది.  నెరిసిన జుట్టు తిరిగి నల్లగా మారేలా చేస్తుంది.  ప్రతి రోజూ ఉదయాన్నే 15మి.లీ ఉసిరి రసాన్ని నీళ్లలో కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

కరివేపాకు..

జుట్టు సంరక్షణలో కరివేపాకు కూడా బాగా సహాయపడుతుంది. ఇది చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. ఇవి హెయిర్ ఫోలికల్స్ లో  మెలనిన్ ఉత్పత్తిని పునరిద్దరిస్తాయి. తెల్లగా ఉన్న జుట్టును నల్లగా మారుస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక రెమ్మ కరివేపాకు ఆకులను ఖాళీ కడుపుతో నమిలి తింటే జుట్టు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.

Oats Vs Daliya: ఓట్స్ లేదా గోధుమ నూక.. బరువు తగ్గడానికి ఏది మంచిదంటే..


గోధుమ గడ్డి..

జుట్టు చిన్న వయసులోనే తెల్లగా మారడాన్ని నివారించడంలో గోధుమ గడ్డి ప్రభావవంతంగా ఉంటుంది. గోధుమ గడ్డి వెంట్రుకల కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది.జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది.  శరీరంలో టాక్సన్లను తొలగిస్తుంది. తాజా  గోధుమ గడ్డిని జ్యూస్ చేసుకుని తాగవచ్చు లేదా గోధుమ గడ్డి పౌడర్ ను కూడా వినియోగించవచ్చు.

నల్ల నువ్వులు..

నువ్వులు భారతీయులకు వరం లాంటివి.  వీటికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. జుట్టును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో నువ్వులు సహాయపడతాయి. శరీరానికి ఐరన్  ను అందిస్తాయి. తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి.  జుట్టు పెరుగుదలకు, జుట్టు నల్లగా మారడానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. ప్రతి రోజూ ఒక స్పూన్ నల్ల నువ్వులను తింటూ ఉంటే జుట్టు నల్లగా మారడం ఖాయం.

ఇవి కూడా చదవండి..

రుచికరమైన మునగాకు రైస్.. ఇలా చేస్తే అదుర్స్..

నెయ్యి తీసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుందా.. అసలు నిజాలివీ..

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 23 , 2024 | 05:36 PM