ట్రంప్‌వైపు మొగ్గుతున్నారు
ABN , Publish Date - Oct 29 , 2024 | 03:23 AM
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు ఓటేసేందుకు గతంలో కంటే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వే స్పష్టం చేసింది.
భారతీయ అమెరికన్ ఓటర్లలో మార్పు
వాషింగ్టన్, అక్టోబరు 28: వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు ఓటేసేందుకు గతంలో కంటే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వే స్పష్టం చేసింది. స్వతహాగా డెమొక్రాట్లకు మద్దతుగా ఉండే భారతీయ అమెరికన్లలో మార్పు రావడం ఆ పార్టీకి ఓ హెచ్చరికగా పేర్కొంది. ‘‘2024 ఇండియన్-అమెరికన్ యాటిట్యూడ్స్’’ పేరుతో పరిశోధన, విశ్లేషణ సంస్థ యుగవ్ భాగస్వామ్యంతో కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంస్థ ఈ సర్వే చేసింది. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 15 మధ్య 714 మంది అభిప్రాయాలు సేకరించి ఆ వివరాలు వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. 61ు భారతీయ అమెరికన్లు డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హ్యారి్‌సకు ఓటేయనున్నారు. 32ు మంది రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు జై కొట్టారు.
నాలుగేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు 22 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు ఓటేయగా.. అప్పట్లో జో బైడెన్‌కు 68 శాతం మంది మద్దతు తెలిపారు. 2020 నుంచి ట్రంప్‌వైపు భారతీయ అమెరికన్లు మొగ్గు చూపుతున్నారు. ఇక భారతీయ అమెరికన్ మహిళల్లో 67 శాతం, పురుషుల్లో 53 శాతం హ్యారి్‌సకు ఓటేస్తామని చెప్పారు. భారతీయ మూలాలున్న వారు సుమారు 52 లక్షల మంది అమెరికాలో నివసిస్తున్నారు. ఇందులో 2022 డేటా ప్రకారం సుమారు 26 లక్షల మందికి ఓటు హక్కు ఉంది.