Share News

Iran: దాడికి సై అంటోన్న ఇజ్రాయెల్..!

ABN , Publish Date - Aug 05 , 2024 | 11:39 AM

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా మిలిటరి కమాండ్ ఫూద్ షుక్రు హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామనిఇరాన్ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఈ రోజు (సోమవారం) దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ అప్రమత్తంగా ఉండాలని జీ7 సదస్సులో సూచించిందని యాక్సిస్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

Iran: దాడికి సై అంటోన్న ఇజ్రాయెల్..!
Israel- Iran Conflict

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా మిలిటరి కమాండ్ ఫూద్ షుక్రు హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయెల్‌పై (Israel) దాడి చేస్తామనిఇరాన్ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఈ రోజు (సోమవారం) దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ అప్రమత్తంగా ఉండాలని జీ7 సదస్సులో సూచించిందని యాక్సిస్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.


అలర్ట్.. అత్యవసర సమావేశం..

ఇస్మాయిల్ హనియా, ఫదూ షుక్రు మృతిచెందిన తర్వాత ఇరాన్, హమాస్, హిజ్బుల్లా అప్రమత్తం అయ్యాయని ఇజ్రాయెల్ అంచనా వేసింది. ఆ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గల్లంట్, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హర్జి హలెవి, మొస్సద్, షిన్ బెట్ అధిపతులు డేవిడ్ బర్నేనా, రొనెన్ బార్‌తో అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహు అత్యవసరం సమావేశం నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్య్టా.. ఇజ్రాయెల్‌పై దాడిని నిరోధించడానికి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇరాన్‌పై ముందస్తు దాడి చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని నేతన్యాహు అనుకుంటున్నారని ఇజ్రాయెల్ టైమ్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఇరాన్ దాడి చేసే వరకు వేచి చూడటం కన్నా.. ముందే దాడి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


టార్గెట్ సైనిక స్థావరాలు

ఇజ్రాయెల్ భూభాగంపై హిజ్బుల్లా దాడులు మరింత పెరుగుతాయని ఇరాన్ ఇదివరకే ప్రకటన చేసింది. సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. 2006లో బీరుట్‌లో గల లెబనాన్‌లో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ బాంబ్ దాడి చేసింది. ప్రస్తుతం పరిస్థితి దిగజారడంతో విమానాలు అందుబాటులో ఉన్న సమయంలో లెబనాన్ వదిలి రావాలని భారతదేశం, ఇతర దేశాలు ఆ దేశ పౌరులను రాయబారులు కోరుతున్నాయి.


నేపథ్యం ఇదే..!!

హిజ్బుల్లాను 1980లో ఇరాని మద్దతుదారుల ప్రారంభించారు. మధ్య ఆసియాలో ఇరాన్‌ ప్రతినిధిగా కొనసాగుతోంది. హిజ్బుల్లాకు ఇస్లామిక్ రివల్యూషనరి గార్డ్ కార్ప్స్ నగదును సమకూరుస్తోంది. ఇరాన్ భావజలాన్ని హిజ్బుల్లా విధిగా పాటిస్తోంది. ఆ సంస్థలో లెబనాన్ షియా ముస్లింలను నియమించి, దాడులు చేస్తుంటుంది. ఇస్మాయిల్ హనియా, ఫూద్ షుక్రు హత్యలను హిజ్బుల్లా జీర్ణించుకోలేక పోతుంది. ఈ రోజు ఉదయం ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా క్షిపణులను ప్రయోగించింది. వాటిని ఇజ్రాయెల్ ధీటుగా తిప్పికొట్టింది.


Read Latest
International News and Telugu News

Updated Date - Aug 05 , 2024 | 01:49 PM