Share News

Israel Gaza Conflict: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతం

ABN , Publish Date - Aug 22 , 2024 | 05:35 AM

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల వల్ల కనీసం 50 మంది పాలస్తీనియన్లు మరణించారని, 124 మంది గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Israel Gaza Conflict: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతం

  • 50మంది పాలస్తీనియన్ల మృతి, 124 మందికి గాయాలు

  • ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రాకెట్ల దాడి

జెరూసలెం, ఆగస్టు 21: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల వల్ల కనీసం 50 మంది పాలస్తీనియన్లు మరణించారని, 124 మంది గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే సెంట్రల్‌ గాజాలోని డీర్‌ ఎల్‌-బాలా నుంచి ప్రజలు తరలిపోవాలని ఇజ్రాయెల్‌ ఆర్మీ తాజాగా ఆదేశించింది.


దీన్ని బట్టి ఆర్మీ భూతల ఆపరేషన్స్‌ను దక్షిణం నుంచి సెంట్రల్‌ గాజాకు విస్తరించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు లెబనాన్‌ బెకా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో హెజ్‌బొల్లా ప్రతిదాడులకు దిగింది. నార్తర్న్‌ ఇజ్రాయెల్‌లోని మిలిటరీ పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌ దాడులు చేసినట్టు బుధవారం పేర్కొంది. అయితే ఈ ఘటనను ఇజ్రాయెల్‌ ఆర్మీ ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.


కాగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రాకెట్లతోనూ విరుచుకుపడింది. 50కి పైగా రాకెట్లతో గోలన్‌ హైట్స్‌లోని పలు ప్రైవేటు ఇళ్లపై దాడులు జరిపినట్టు పేర్కొంది. ఈ దాడుల వల్ల ఒక ఇల్లుకు మంటలు అంటుకున్నాయని, గ్యాస్‌ లీకేజీని ఆపడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని నిరోధించగలిగినట్టు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. మంగళవారం రాత్రి లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడికి ప్రతిస్పందనగా ఈ దాడి చేసినట్టు హెజ్‌బొల్లా పేర్కొంది.

Updated Date - Aug 22 , 2024 | 05:35 AM