Share News

Iran- Israel Conflict: ఈ వారమే దాడి.. అమెరికా భద్రత ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 13 , 2024 | 09:21 AM

హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హత్య, బీరూట్‌లో హిజ్బుల్లా కమాండర్‌ హత్యలు ఇజ్రాయెల్ పనేనని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల హిజ్బుల్లా గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే.

Iran- Israel Conflict: ఈ వారమే దాడి.. అమెరికా భద్రత ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు
USA

హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హత్య, బీరూట్‌లో హిజ్బుల్లా కమాండర్‌ హత్యలు ఇజ్రాయెల్ పనేనని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల హిజ్బుల్లా గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. బహుశా ఈ వారంలోనే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని మొదలుపెట్టవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.


ఈ వారంలోనే ఇరాన్ లేదా మధ్యప్రాచ్యంలో దాని అనుకూల గ్రూపులు ఇరాన్‌పై ప్రభావిత దాడులు జరపవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను అమెరికా సిద్ధమైందని, మధ్యప్రాచ్యంలో తన ప్రాంతీయ బలాన్ని పెంచుకుందని కిర్బీ వెల్లడించారు. తూర్పు ఆసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు సంబంధించి తమ అంచనాలను పంచుకుంటామని, ఈ వారమే ప్రారంభం కావొచ్చని వ్యాఖ్యానించారు.

ముఖ్యమైన దాడులకు తాము సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. కాగా ఇరాన్, దాని అనుకూల మిత్రులు దాడి చేస్తే ఇజ్రాయెల్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌కు రక్షణగా ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ ఆదేశాల మేరకు ఆ దేశ గైడెడ్ క్షిపణి జలాంతర్గాములు మధ్యప్రాచ్య ప్రాంతం దిశగా కదలి వెళ్తున్నాయి.


కాగా గత నెలలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. పాలస్తీనాలో యూదుల హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థ సమూహం ఈ హత్య చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ చెబుతోంది. తమ భూభాగంపై హత్యకు పాల్పడ్డవారిని ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. మరోవైపు తమ కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌పై దాడులు జరుపుతామని ప్రకటించిన హిజ్బుల్లా.. ఇరాన్‌తో చేతులు కలిపింది. కాగా ఇటీవల ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లో హిజ్బుల్లా రాకెట్ దాడి చేసింది. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు చనిపోయారు. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న సీనియర్ హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ అంతమొందించింది.

Updated Date - Aug 13 , 2024 | 09:21 AM