-
-
Home » Mukhyaamshalu » Breaking News October 11th Today Latest Telugu News Live Updates Siva
-
Breaking News Live Updates: ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే..
ABN , First Publish Date - Oct 11 , 2024 | 04:26 PM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-10-11T20:24:52+05:30
హమ్మయ్య.. 140 మంది ప్రయాణికులు సేఫ్..
తిరుచ్చి: సేఫ్‌గా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం
విమానంలో 140 మంది ప్రయాణికులు క్షేమం
రెండున్నర గంటల ఉత్కంఠ తర్వాత.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
గాలిలో 17 సార్లు చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా విమానం
-
2024-10-11T20:06:53+05:30
BIG Breaking: తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్..
తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB-613 విమానం
విమానంలో 140 మంది ప్రయాణికులు
టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం
రెండు గంటలకు పైగా గాలిలోనే విమానం చక్కర్లు
ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్
సేఫ్ ల్యాండింగ్ కోసం సిబ్బంది ప్రయత్నాలు
తిరుచ్చి AI విమానం హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం
విమానంలో ఇంధనాన్ని ఖాళీ చేయించేందుకు యత్నాలు
మిగతా విమానాలను ఇతర ఎయిర్‌పోర్టులకు దారిమళ్లింపు
తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో పెద్దసంఖ్యలో..
పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లు
-
2024-10-11T17:19:38+05:30
రఘురామ కేసులో బిగ్ అప్‌డేట్..
గుంటూరు జిల్లా: రఘురామకృష్ణం రాజు కేసులో విచారణ.
విచారణకు హజరైన సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్.
పశ్చిమ డిఎస్పీ ఆఫీస్‌లో కొనసాగుతున్న విచారణ.
రఘురామ కేసులో విచారణ అధికారిగా ఉన్న విజయ్ పాల్.
గత కొంత కాలంగా పరారీ లో ఉన్న విజయ్ పాల్.
హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేసిన విజయ్ పాల్.
ముందస్తు బెయిల్ రాకపోవడంతో విచారణకు వచ్చిన విజయ్ పాల్.
-
2024-10-11T16:53:17+05:30
ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లా మూడో టీ20 నైట్ మ్యాచ్
శనివారం ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లా మూడో టీ20 నైట్ మ్యాచ్.
ఉప్పల్ స్టేడియం వద్ద పటిష్టమైన భారీ భద్రతను ఏర్పాటు చేయనున్న రాచకొండ పోలీసులు.
మొత్తం 2,600 మంది పోలీసులతో మ్యాచ్‌కు బందోబస్తు.
250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది.
1,662 మంది లా అండ్ ఆర్డర్, 14 ప్లాటూన్ల టీఎస్‌ఎస్పీ, 6 ప్లాటూన్ల సాయుధ దళాలు.
10 వజ్రా వెహికిల్స్, 2 ఆక్టోపస్ బృందాలు, ఎన్ఎస్జి కమాండోస్, 10 మౌంటెడ్ పోలీసులతో భద్రత.
ఎస్బీ, సీసీఎస్ సిబ్బంది, ఎస్వోటీ, 2 ఫైర్ టెండర్లతో బందోబస్తు.
300 సీసీ కెమెరాలతో నిఘా, బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
-
2024-10-11T16:26:48+05:30
బాబోయ్.. యూట్యూబ్ అంత పని చేస్తోందా..?
యూట్యూబ్ వీడియోలు చూడటానికి ముందు కొన్ని యాడ్స్ వస్తాయి. 5 సెకన్ల వ్యవధితో స్కిబ్ ఆప్షన్ కనిపిస్తుంది. అయితే, ఆ స్కిప్ ఆప్షన్ కనిపించకుండా బ్లాక్ లేయర్‌ను పెడుతోందంటూ యూట్యూబ్ యూజర్లు ఆరోపిస్తున్నారు. యాడ్ మొత్తం చూడాలనే ఉద్దేశంతో యూట్యూబ్ నిర్వాహకులు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను యూట్యూబ్ ప్రతినిధి ఒలువా ఫలోదున్ ఖండించారు. యూట్యూబ్ యాడ్ స్కిప్ బటన్‌ను తీసివేయలేదని, దేనితోనూ కవడం చేయడం లేదన్నారు. స్కిప్ యాడ్ ఆప్షన్ కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.