-
-
Home » Mukhyaamshalu » Breaking News October 8th Today Latest Telugu News Live Updates Siva
-
Breaking News Live Updates: ఏపీలో బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..
ABN , First Publish Date - Oct 08 , 2024 | 08:49 AM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-10-08T17:23:15+05:30
కశ్మీర్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు
జమ్ముకశ్మీర్ ప్రజలు జెకెఎన్సీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం
కశ్మీర్ ప్రజలు బీజేపీ విధానాలను వ్యతిరేకించారు
హర్యానా ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి
నా ఫిర్యాదులకు ఈసీ స్పందించింది
మూడు జిల్లాల్లో ఈవీఎంలకు సంబంధించి అధికారుల తీరుపై అనుమానాలు ఉన్నాయి
క్షేత్ర స్థాయి పరిస్థితులకు వ్యతిరేకంగా హర్యానా ఫలితాలు ఉన్నాయి: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
-
2024-10-08T16:24:39+05:30
సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్
హైదరాబాద్: కేటీఆర్ వల్ల నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని మంత్రి కొండా సురేఖ మాట్లాడారు: స్టేట్మెంట్లో సుప్రియ
ఎన్ కన్వెన్షన్ విషయంలో కేటీఆర్ వద్దకు సమంతను పంపించామని, అందుకే విడాకులు అని మాట్లాడారు.
మంత్రి వ్యాఖ్యలతో కుటుంబం మొత్తం షాక్‌నకు గురైంది.
మా కుటుంబంపై మంత్రి కొండా సురేఖ ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదు.
మంత్రి వ్యాఖ్యలతో కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది.
మంత్రి చేసిన వ్యాఖ్యలు టీవీల్లో చూసి, షాక్‌నకు గురయ్యా
ఇదే అంశాన్ని నేషనల్ మీడియాలో వార్త చూశాను
మరుసటి రోజు పేపర్లో వార్త వచ్చింది..
మంత్రి వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్రవేదనకు గురైంది.
ఈ రోజు సుప్రియ స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేసిన కోర్టు
తదుపరి విచారణ 10వ తేదీకి వాయిదా
ఆ రోజున మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్ మెంట్ రికార్డు చేస్తాం: కోర్టు
-
2024-10-08T15:58:16+05:30
కీలక పరిణామం.. సాక్షిగా సుప్రియ
స్టేట్మెంట్ రికార్డ్ పూర్తయ్యింది: హీరో నాగార్జున
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడం సిగ్గుచేటు
సినీ రంగంలో ఉన్న వారి మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు.
ఇద్దరు సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న కోర్టు
బీఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
-
2024-10-08T15:17:59+05:30
నాంపల్లి కోర్టుకు నాగార్జున
హైదరాబాద్: నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన హీరో నాగార్జున
నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న న్యాయస్థానం
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పిటిషన్ దాఖలు
ప్రొసిజర్ ప్రకారం పిటిషనర్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న న్యాయస్థానం
నాగార్జున స్టేట్మెంట్ తర్వాత సాక్షుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసే అవకాశం
నాగార్జునతోపాటు కోర్టుకు చేరుకున్న భార్య అమల, కుమారుడు నాగచైతన్య
-
2024-10-08T15:03:18+05:30
నిందితుడిపై కఠిన చర్యలు
అమరావతి:బాలికపై అఘాయిత్యం అమానుషం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధేసింది
ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో వెలుగులోకి వచ్చింది
లేదంటే నిందితుడు తప్పించుకునే అవకాశం ఉండేది.
ఈ చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించా: పవన్ కల్యాణ్
-
2024-10-08T14:50:41+05:30
రవాణాశాఖలో సంస్కరణలు
హైదరాబాద్: రవాణా శాఖలో సంస్కరణలు తీసుకొస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
మోటారు వాహన చట్టంలో భాగంగా దేశంలో 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్ అమలు చేస్తుంది.
ఇంటర్ స్టేట్ రిలేషన్స్కి ఇబ్బంది వస్తుండటంతో క్షేత్ర స్థాయిలో ఆర్టీవో డీటీవోలతో సమావేశం ఏర్పాటు చేస్తాం.
రాష్ట్రంలో సారథి ఈ వాహన పోర్టల్ చేరుతున్నాం
జీవో 28 ద్వారా ఇది అమలు చేస్తున్నాం: పొన్నం ప్రభాకర్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
-
2024-10-08T13:55:04+05:30
నాంపల్లి కోర్టుకు నాగార్జున..
జూబ్లిహిల్స్ నివాసం నుంచి బయలుదేరిన నాగార్జున.
2:15 గంటలకు కోర్టులో నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్.
మరి కాసేపట్లో నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్ ముందు హాజరుకానున్న నాగార్జున.
కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పిటిషన్ సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న న్యాయస్థానం.
హీరో నాగార్జున తరఫున వాదనలు వినిపించునున్న న్యాయవాది అశోక్ రెడ్డి.
ఇప్పటికే ఇంటి నుండి కోర్టుకు బయలుదేరిన నాగార్జున.
-
2024-10-08T13:19:36+05:30
ఏపీలో బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..
కర్నూలు : ఆదోనిలో బీజేపీకి భారీ షాక్..
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్.
బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపిన ప్రకాశ్ జైన్.
-
2024-10-08T11:31:44+05:30
పిఠాపురంలో ఘోరం.. 16 ఏళ్ల బాలికను..
కాకినాడ : పిఠాపురంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.
మద్యం తాగించి ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు.
స్టేట్ బ్యాంక్ సమీపంలో నడిచి వెళ్తున్న బాలికను ఆటో డ్రైవర్‌తో పాటు మరో మహిళ కలిసి కిడ్నాప్.
మాదాపురం రోడ్డులో డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకుని వెళ్లి మద్యం పట్టించి అత్యా చారానికి పాల్పడినట్లు పిర్యాదు.
అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆటోలో ఎక్కి స్తుండగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ఓ మహిళ.
నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన బంధువులు.
అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వైద్య పరీక్షలు కోసం ఆసుపత్రికి తరలింపు.
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ మాజీ కౌన్సిలర్ భర్తగా చెబుతున్న స్థానికులు.
-
2024-10-08T10:46:55+05:30
జగన్‌పై టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్..
విజయవాడ: జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్.
వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శం.
ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారు.
ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారు.
ఇటువంటి వాటిని చూసి వైసిపి నేతలు భరించ లేక పోతున్నారు.
వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి.
అబద్దాలు ప్రచారం చేసే అడ్రెస్ లేకుండా పోయారు.
మళ్లీ చేస్తే.. వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం.
దమ్ముంటే వరదల్లో అవినితి జరిగిందని బహిరంగ చర్చకు రావాలి.
అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.
వరదల్లో ప్రజలు అల్లాడితే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్.
ఏనాడైనా బురదలో అడుగు పెట్టి ప్రజలను కలిశావా.
నువ్వా పేద ప్రజల కోసం మాట్లాడేది.
వరద ప్రజలకు నువ్వెంత సహాయం చేశావు.
కోటి రూపాయలు ప్రకటించిన జగన్ ఎవరికి ఖర్చు పెట్టారు.
సిగ్గు శరం లేకుండా అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేస్తావా.
విపత్తు ఎప్పుడు వచ్చినా నేనున్నా అని ప్రజలతో ఉండే సీఎం చంద్రబాబు.
ప్రజా దనాన్ని దోచుకున్న జగన్ కూడా నీతులు వల్లిస్తున్నాడు.
అబద్దాలు చెప్పడానికి కూడా అర్ధం లేదా మీకు.
రాష్ట్రాన్ని నాశనం చేయాలనే మీ కుట్రలను తిప్పి కొడతాం.
జగన్ నీకు సిగ్గుంటే ఇప్పుడు అయినా మనసు మార్చుకో.
151 స్థానాల నుంచి 11స్థానాలకు ప్రజలు నిన్ను పరిమితం చేశారు.
ఇలాంటి కుట్రలు చేస్తే ఒక్క స్థానం కూడా ఉండదు.
పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ప్రజలే తరిమి కొడతారు.
జగన్ ప్రజలకు సేవ చేయడం అలవాటు చేసుకో.
కుట్ర, కుళ్లు రాజకీయాలు మానుకో జగన్.
-
2024-10-08T10:26:06+05:30
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. భారీ సంఖ్యలో మావోలు హతం..
ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లా బెజ్జి పీఎస్ పరిధిలో ఎన్కౌంటర్
పామలూర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కాల్పుల్లో..
కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు లోకేష్ హతం
ఘటనా స్థలంలో కొనసాగుతున్న కూంబింగ్
మావోయిస్ట్ మృతులు సంఖ్య పెరిగే అవకాశం
-
2024-10-08T09:33:21+05:30
పిఠాపురంలో ఘోరం.. 16 ఏళ్ల బాలికను..
కాకినాడ : పిఠాపురంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.
మద్యం తాగించి ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు.
స్టేట్ బ్యాంక్ సమీపంలో నడిచి వెళ్తున్న బాలికను ఆటో డ్రైవర్‌తో పాటు మరో మహిళ కలిసి కిడ్నాప్.
మాదాపురం రోడ్డులో డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకుని వెళ్లి మద్యం పట్టించి అత్యా చారానికి పాల్పడినట్లు పిర్యాదు.
అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆటోలో ఎక్కి స్తుండగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ఓ మహిళ.
నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన బంధువులు.
అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వైద్య పరీక్షలు కోసం ఆసుపత్రికి తరలింపు.
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ మాజీ కౌన్సిలర్ భర్తగా చెబుతున్న స్థానికులు.
-
2024-10-08T09:13:24+05:30
హైదరాబాద్‌లో రూ.7 వేల కోట్లు భారీ కుంభకోణం..
హైదరాబాదులో డిబి స్టాక్ బ్రోకింగ్ స్కాం ప్రకంపనలు.
స్టాక్ బ్రోకింగ్‌లో రూ. 7000 కోట్ల రూపాయల స్కామ్‌కి పాల్పడ్డ డిబి కంపెనీ
డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ సైబరాబాద్‌లో ఫిర్యాదులు.
అధిక అధిక లాభాలు ఆశ చూపెట్టి మోసాలకు పాల్పడ్డ డిబి స్టాక్ బ్రోకింగ్.
డిపి స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్తో పాటు పలువురుపై కేసులు.
ముంబై బెంగళూరు కలకత్తా ఢిల్లీతో పాటు హైదరాబాదులో కేసులు.
స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు.
హైదరాబాదులో 20 వేల మంది డిబి స్టాక్ బ్రోకింగ్ బాధితులు ఉన్నట్లు గుర్తింపు.
-
2024-10-08T09:09:27+05:30
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..
ఢిల్లీలో నేడు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీబిజీ.
పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం చంద్రబాబు.
ఉదయం గం. 11.00కు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ.
సాయంత్రం గం. 4.30కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం.
సాయంత్రం గం 5:45 కు కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ.
రాత్రి గం 8.00కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం.
రాత్రి గం 11:15 కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ.
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు. శ్రీనివాస వర్మతో తన నివాసంలోనే సమావేశమైన చంద్రబాబు.
-
2024-10-08T08:49:29+05:30
మంత్రి కొండా సురేఖపై కేసులో నేడు కీలక పరిణామం..
మంత్రి కొండా సురేఖపై హీరో నాగర్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరుగనుంది.
నాగార్జున కుటుంబపై ఇటీవల కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు.
మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేసిన హీరో నాగార్జున.
తన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరిన నాగార్జున.
నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై నేడు నాంపల్లి ఎక్సైజ్ కోర్టు విచారణ.
నేడు విచారణ కు హాజరు కానున్న నాగార్జున.
నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న న్యాయస్థానం.
నాగార్జున స్టేట్మెంట్తో పాటు సాక్షుల స్టేట్మెంట్ను రికార్డు చేయనున్న న్యాయస్థానం.
నాగార్జున వేసిన క్రిమినల్ పిటిషన్‌పై లీగల్‌గానే ఫైట్ చేస్తానంటూన్న కాంగ్రెస్ లీగల్ సెల్.
-
2024-10-08T07:24:07+05:30
రేపు అమ్మవారి సన్నిధికి సీఎం చంద్రబాబు
అమరావతి: రేపు కనకదుర్గ ఆలయానికి సీఎం చంద్రబాబు.
కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
రేపు భక్తులకు ఉచిత దర్శనాలు
దసరా నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన మూలా నక్షత్రం సందర్భంగా తెల్లవారుజాము మూడు గంటల నుంచి భక్తులకు దర్శనం
రూ.100, రూ.300, రూ.500 టికెట్లతో పాటు వీఐపీ దర్శనాలు నిలిపివేత: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి