Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Sep 14 , 2024 | 07:53 AM

Breaking News September 14th Today Latest Telugu News Live Updates Siva

 Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-09-14T13:18:43+05:30

    ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కి నటి జత్వానీ.. ఎందుకంటే..

    • ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ముంబై నటి జత్వానీ.

    • శుక్రవారం రాత్రి న్యాయవాదులతో కలిసి వచ్చిన జత్వాని.

    • ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి స్టేషన్‌కి వచ్చిన జత్వాని.

  • 2024-09-14T12:02:25+05:30

    ‘కౌశిక్ అన్నా.. ఎట్లున్నవ్’.. కేటీఆర్ పరామర్శ..

    • హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్.

    • కౌశిక్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్.

    • ఆయనను ఆలింగనం చేసుకున్న కేటీఆర్.

    • టైగర్ కౌశిక్ భాయ్ అంటూ సంబోధన.

    • బైపాస్ సర్జరీ చేయించుకుని మొన్నటి దాడిలో గాయపడ్డ కౌశిక్ రెడ్డి మామ కృష్ణారెడ్డిని పరామర్శించిన కేటీఆర్.

    • ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్.

    • కొండాపూర్ కౌశిక్ రెడ్డి ఇంటి నుండి హరీష్ రావు ఇంటికి బయలుదేరిన మాజీ మంత్రి కేటీఆర్.

  • 2024-09-14T10:33:24+05:30

    సీపీఎం కేంద్ర కార్యాలయానికి సీతారం ఏచూరి భౌతికకాయం

    • ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయం ఏ కేజీ భవన్‌కు సీతారాం ఏచూరి భౌతికకాయం తరలింపు.

    • కాసేపట్లో ప్రజలు కార్యకర్తల సందర్శనార్థం ఏచూరి భౌతికకాయం.

    • మధ్యాహ్నం 3గం.ల వరకు ప్రజలు కార్యకర్తల కడసారి నివాళి కోసం ఏ కేజీ భవన్‌లో పార్థీవదేహం.

    • సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానున్న ఏచూరి అంతిమయాత్ర.

    • ఏచూరి కోరిక మేరకు ఆయన భౌతిక కాయాన్ని పరిశోధనల కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి అందించనున్న కుటుంబ సభ్యులు.

    • మరికాసేపట్లో సీతారాం ఏచూరి పార్థివదేహానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, కేరళ సీఎం పినరయ్ విజయన్, ప్రకాష్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, మాజీ ఎంపీ మధు, పార్టీ శ్రేణులు నివాళులర్పించనున్నారు.

  • 2024-09-14T10:20:57+05:30

    కొనసాగుతున్న పడవల తొలగింపు ప్రక్రియ..

    • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద ఐదో రోజుకు చేరుకున్న పడవలు తొలగింపు ప్రక్రియ.

    • తొలగింపు ప్రక్రియలో పాల్గొంటున్న రెండు ప్రత్యేక బృందాలు.

    • తొలగింపు ప్రక్రియలో పాల్గొంటున్న వైజాగ్ నుంచి స్కూబా టీం, కాకినాడ నుంచి అబ్బులు టీం.

    • ఒకపక్క కటింగ్ మరోపక్క బయటకు లాగేందుకు ప్రయత్నాలు.

    • నిన్న కట్ చేసిన పడవను బయటకు లాగేందుకు ప్రయత్నం.

    • రెండు టీములు కలిసి పనిచేయడంతో ఫలించిన వ్యూహం.

    • పడవల్లో కదలికలు.. లాగే కొంది నీటిలోకి వెళ్లిన కటింగ్ అయిన పడవ.

    • నేడు ఒక పడవనైనా బయటికి లాగానే ప్రయత్నం.

  • 2024-09-14T09:49:58+05:30

    ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..

    • ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేస్ నమోదు.

    • కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.

    • గాంధీతోపాటు, అతని కుమారుడు, గాంధీ సోదరుడి పైన కేసు నమోదు.

    • మరో ఇద్దరు కార్పొరేటర్ల పైన అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు.

    • కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్‌తో పాటు, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ లను నిందితులుగా చేర్చిన పోలీసులు.

  • 2024-09-14T07:55:37+05:30

    మాజీ మంత్రి సోదరుడికి పోలీసుల నోటీసులు..

    • మాజీమంత్రి అంజాద్ భాష సోదరుడు అహ్మద్ భాషకు 41ఏ నోటీసు ఇచ్చిన పోలీసులు.

    • హోమ్ మంత్రి అనిత, కడప ఎమ్మెల్యే మాధవిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైనపోస్టులను పోస్టుచేసిన వైసీపీశ్రేణు లు.

    • ఈ కేసులో విచారణకు రావాలని అహ్మద్ భాషకు నోటీసులు.

  • 2024-09-14T07:53:16+05:30

    చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..

    • బంగారుపాలెం మండలం బెంగుళూరు-చెన్నై జాతీయ రహదారి తగ్గువారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.

    • ఇద్దరు వ్యక్తులు మృతి.

    • మరో నలుగురికి తీవ్ర గాయాలు.

    • హైవేపై రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న కారు.

    • కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి.

    • మరో నలుగురికి తీవ్ర గాయాలు.

    • బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళుతుండగా ప్రమాదం.

    • గాయపడ్డ వ్యక్తులను స్థానిక బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలింపు.