Share News

Chhattisgarh : ఐఈడీ పేలి ఇద్దరు జవాన్ల మృతి

ABN , Publish Date - Jun 24 , 2024 | 05:15 AM

రాష్ట్రం సుకుమా జిల్లాలో ఆదివారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా 210 కోబ్రా బలగాలు జేగురుగొండ పోలీ్‌సస్టేషన్‌ క్యాంపు నుంచి టేకులగూడెం వైపు ట్రక్కు, ద్విచక్రవాహనాలపై బయల్దేరారు.

Chhattisgarh : ఐఈడీ పేలి ఇద్దరు జవాన్ల మృతి

  • ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో ఘటన

  • మావోయిస్టుల స్థావరంలో

  • బయటపడ్డ దొంగనోట్ల ముద్రణ యంత్రం

దుమ్ముగూడెం, జూన్‌ 23 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో ఆదివారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా 210 కోబ్రా బలగాలు జేగురుగొండ పోలీ్‌సస్టేషన్‌ క్యాంపు నుంచి టేకులగూడెం వైపు ట్రక్కు, ద్విచక్రవాహనాలపై బయల్దేరారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని వారు ప్రయాణించే మార్గంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ట్రక్కు గాల్లోకి లేచింది. దీంతో ట్రక్కు నడుపుతున్న డ్రైవర్‌ సహా ట్రక్కులోనే ఉన్న మరో డ్రైవర్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇతర జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు.

మృతి చెందిన జవాన్లను ఆర్‌.విష్ణు, శైలేంద్రలుగా గుర్తించారు. సుక్మా జిల్లా కొరాజ్‌గూడ అటవీ ప్రాంతంలోని మావోయిస్టుల స్థావరంపై పోలీసు బలగాలు ఆదివారం దాడి చేశాయి. ఈ సందర్భంగా అక్కడ నకిలీ రూ.50, 100, 200, 500 కరెన్సీ నోట్లతోపాటు నకిలీ నోట్ల ముద్రణ యంత్రాన్ని పోలీసులు గుర్తించారు. నిధుల కొరత కారణంగా మావోయిస్టులు నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. శిబిరంలో తుపాకులు, పేలుడు పదార్థాలు, ముద్రించిన కరెన్సీనోట్లు, వాకీటాకీలు, మందులు, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మావోయిస్టుల శిబిరంలో కరెన్సీ నోట్లను ముద్రించే యంత్రం లభించడం ఇదే మొదటిసారని పోలీసు అధికారులు తెలిపారు.

Updated Date - Jun 24 , 2024 | 05:15 AM