Share News

Union Minister Suresh Gopi : నేను వైదొలగట్లేదు

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:51 AM

కేంద్ర మంత్రి పదవి విషయంలో ప్రముఖ నటుడు సురేశ్‌ గోపీ మాట మార్చారు. మోదీ క్యాబినెట్‌లో కొనసాగడం అదృ ష్టం అని.. తాను రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. కేరళలోని త్రిసూర్‌ నుంచి గెలిచిన సురేశ్‌ గోపీ.. ఆదివారం రాత్రి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.

Union Minister Suresh Gopi : నేను వైదొలగట్లేదు

  • నా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు

  • మోదీ క్యాబినెట్‌లో చోటు గర్వకారణం

  • నటుడు, కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ

  • మోదీ క్యాబినెట్‌లో ఉండటం అదృష్టం

న్యూఢిల్లీ, తిరువనంతపురం, జూన్‌ 10: కేంద్ర మంత్రి పదవి విషయంలో ప్రముఖ నటుడు సురేశ్‌ గోపీ మాట మార్చారు. మోదీ క్యాబినెట్‌లో కొనసాగడం అదృ ష్టం అని.. తాను రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. కేరళలోని త్రిసూర్‌ నుంచి గెలిచిన సురేశ్‌ గోపీ.. ఆదివారం రాత్రి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, కాసేపటికే.. ‘‘నేను సినిమాలు చేయాలనుకుంటున్నా. ఈ బాధ్యతల నుంచి త్వరలోనే విముక్తి చేస్తారని భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ఇవి కాస్త చర్చనీయాంశం కావడంతో ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు. కేరళ ప్రతినిధిగా మోదీ క్యాబినెట్‌లో చోటుదక్కడం గర్వకారణమని, కొన్ని మీడియా సంస్థలు తాను రాజీనామా చేస్తున్నట్లు తప్పుడు కథనాలు రాస్తున్నాయన్నారు.

  • మాకు క్యాబినెట్‌ బెర్తులేదా?

కేంద్ర మంత్రివర్గంలో స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి మాత్రమే దక్కడం పట్ల మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన (శిందే) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదుగురు ఎంపీలున్న ఎల్జేపీ (పాసవాన్‌), ఇద్దరున్న జేడీఎస్‌, ఒక్కరే ఉన్న మాంజీకి క్యాబినెట్‌ ర్యాంక్‌ దక్కిందని.. బీజేపీకి సుదీర్ఘ కాలంగా మిత్రపక్షంగా ఉన్న తాము మాత్రం అర్హులం కాదా? అని ప్రశ్నించింది. కాగా, మహారాష్ట్రలో మహాయతి కూటమి సర్కారులో భాగమైన అజిత్‌ పవార్‌ ఎన్సీపీకి సహాయ మంత్రి పదవి ఇవ్వబోగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 11 , 2024 | 04:51 AM