Share News

Adani-Hindenburg row: సెబీ చీఫ్‌ను తొలగించాలంటూ 22న కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

ABN , Publish Date - Aug 13 , 2024 | 06:16 PM

న్యూఢిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం వేడెక్కుతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ అండియా (SEBI) చీఫ్ మాధబి పూరి బచ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

Adani-Hindenburg row: సెబీ చీఫ్‌ను తొలగించాలంటూ 22న కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

న్యూఢిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం (Adani-Hindenburg row) వేడెక్కుతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ అండియా (SEBI) చీఫ్ మాధబి పూరి బచ్ (Madhabi Puri Buch)ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ (congress) పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయాల వద్ద నిరసలకు దిగాలని నిర్ణయించింది. అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మంగళవారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.


''కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు, పీసీసీ అధ్యక్షులతో ఇవాళ సమావేశం జరిగింది. అదానీ-సెబీకి సంబంధం ఉన్న హిండెన్‌బర్గ్ వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలవడంపై ప్రధానంగా చర్చించాం'' అని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ కుంభకోణంలో మోదీ ప్రమేయంపై ఆరోపణలు గుప్పి్స్తూ, ప్రధానంగా తాము రెండు అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలకు నిర్ణయించామని చెప్పారు. ప్రధాన మంత్రి పూర్తి ప్రమేయం ఉన్న అదానీ మెగా స్కామ్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫైనాన్షియల్ మార్కెట్ రెగ్యులేషన్‌ విషయంలో పూర్తిగా మోదీ రాజీపడ్డారని ఆరోపించారు. సెబీ బాస్ రాజీనామా చేయాలనేది కూడా తమ మరో డిమాండ్ అని చెప్పారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఆయా నగరాల్లోని ఈడీ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు.

New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం


సెబీ చైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై ఆగస్టు 10న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్‌లలో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలున్నాయని ఆరోపించింది. దీనీపై బచ్ ఘాటుగా స్పందించారు. ఇది వ్యక్తిత్వ హననమేనని అన్నారు. అదానీ గ్రూప్ సైతం హిండెన్‌బర్గ్ ఆరోపణలు కొట్టివేసింది. సెబీ చైర్‌పర్సన్‌తో కానీ, ఆమె భర్తతో కానీ తమకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని తెలిపింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 13 , 2024 | 06:18 PM