Share News

ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు.. ‌ ‌ఆరెస్సె్‌స్‌పై‌ నిషేధం!

ABN , Publish Date - Nov 10 , 2024 | 04:32 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)కి మద్దతు ఇచ్చేందుకు అఖిల భారత ఉలేమా బోర్డు ముందుకొచ్చింది.

ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు.. ‌ ‌ఆరెస్సె్‌స్‌పై‌ నిషేధం!

  • ఎంవీఏకు మద్దతివ్వడానికి ఉలేమా బోర్డు షరతులు

ముంబై/న్యూఢిల్లీ, నవంబరు 9: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)కి మద్దతు ఇచ్చేందుకు అఖిల భారత ఉలేమా బోర్డు ముందుకొచ్చింది. ఎంవీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తామని ఆ కూటమి నాయకులకు రాసిన లేఖలో పేర్కొంటూ పలు షరతులు విధించింది. ప్రధాన షరతులివీ.. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు రద్దుకు ఎంవీఏ కృషి చేయాలి. ఎంవీఏ అధికారంలోకి వస్తే మహారాష్ట్ర వక్ఫ్‌ బోర్డుకు రూ.1,000 కోట్లు కేటాయించాలి. రాష్ట్రంలో ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయించాలి. ఆరెస్సెస్‌ పై నిషేధం విధించాలి.

Updated Date - Nov 10 , 2024 | 04:32 AM