Share News

Rashtrapati Bhavan :అదిగో పులి?

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:47 AM

ప్రధాన మంత్రిగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అనుకోని అతిథి కనిపించింది. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మధ్యప్రదేశ్‌ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా విజయం సాధించిన దుర్గాదాస్‌ ఉయికె ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన వెనక.. మెట్లపైన ఓ జంతువు వెళ్తూ కనిపించింది.

Rashtrapati Bhavan :అదిగో పులి?

  • రాష్ట్రపతి భవన్‌ వీడియోలో గుర్తింపు

  • పిల్లిగా అనుమానిస్తున్న అధికారులు

  • సోషల్‌ మీడియాలో వైరల్‌గా వీడియో

  • మంత్రులు ప్రమాణం చేస్తుండగా వెనక వెళ్తున్న జంతువు

  • రాష్ట్రపతి భవన్‌ వీడియోలో జంతువు

న్యూఢిల్లీ, జూన్‌ 10: ప్రధాన మంత్రిగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అనుకోని అతిథి కనిపించింది. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మధ్యప్రదేశ్‌ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా విజయం సాధించిన దుర్గాదాస్‌ ఉయికె ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన వెనక.. మెట్లపైన ఓ జంతువు వెళ్తూ కనిపించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. చిరుతపులి అని కొందరు.. కాదు పులికూన అని మరికొందరు కామెంట్లు పెట్టారు.

ఇంకొందరైతే ఏకంగా అంత ఠీవీగా నడిచి వెళ్తోందంటే.. అది పెంపుడు పులి కూన అయ్యి ఉంటుందంటూ వ్యాఖ్యానాలు జోడించారు. అది పిల్లి అని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్రపతి భవన్‌ నుంచి మాత్రం ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వీడియోను తొలుత డీప్‌ఫేక్‌ అయ్యి ఉండొచ్చని అనుమానించినా.. రాష్ట్రపతి భవన్‌ అధికారిక వీడియోలోనూ జంతువు కనిపించింది!

Updated Date - Jun 11 , 2024 | 05:49 AM