Anurag Thakur: జైలుకు వెళ్లినా ముఖ్యమంత్రిగా కొనసాగడం హేయమైన చర్య.. అనురాగ్ ఠాకూర్ ఫైర్..
ABN , Publish Date - Mar 23 , 2024 | 08:17 PM
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. అరెస్టు అయినప్పటికీ దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగడం నీచమైన రాజకీయం అని ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌కు సపోర్ట్ గా నిలిచినందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. అరెస్టు అయినప్పటికీ దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగడం నీచమైన రాజకీయం అని ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌కు సపోర్ట్ గా నిలిచినందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో పార్టీ నాయకులు పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ రేసులో కేజ్రీవాల్ భార్య కూడా ఉన్నారని చెప్పారు. మద్యం స్కామ్ కేసులో వేగవంతమైన చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేసినందుకు ఈడీని కాంగ్రెస్ అభినందించాలని అన్నారు. కానీ అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆప్ కు మద్దతుగా నిలుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Kejriwal : కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు పంపండి.. శిక్ష పడేలా చేస్తా.. సుకేశ్ సంచలన ప్రకటన..
Trending News: రైలులో పురిటి నొప్పులు.. ప్రసవం.. శిశువుకు ఏ పేరు పెట్టారంటే..
55 ఏళ్ల కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు గంటల పాటు ప్రశ్నించిన తర్వాత గురువారం అరెస్టు చేశారు. ఈడీ తనను బలవంతంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో దిల్లీ కోర్టు కేజ్రీవాల్ ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. తన అరెస్టు, ట్రయల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు, రిమాండ్ ఆర్డర్ రెండూ చట్టవిరుద్ధం అని పిటిషన్ వేశారు. మార్చి 24 ఆదివారం నాటికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నుంచి తక్షణ విచారణను కోరారు కేజ్రీవాల్.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.