Share News

Attack: మహిళా ఎయిర్ హోస్టెస్‌పై దాడి.. స్పందించిన ఎయిర్ ఇండియా

ABN , Publish Date - Aug 18 , 2024 | 10:58 AM

ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ఓ ప్రముఖ హోటల్‌లో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి ఓ దుండగుడు వచ్చాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తి ఓ మహిళ గదిలోకి ప్రవేశించి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Attack: మహిళా ఎయిర్ హోస్టెస్‌పై దాడి.. స్పందించిన ఎయిర్ ఇండియా
female air hostess

మహిళలు(womens) ఏ పని చేస్తున్నా కూడా వేధింపులు మాత్రం తప్పడం లేదు. ఎక్కడో ఓ చోట, ఏదో ఒక విధంగా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఇటివల ఎయిర్ ఇండియా(air india) మహిళా సిబ్బంది ఓ ప్రముఖ హోటల్‌లో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి ఓ దుండగుడు వచ్చాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తి ఓ మహిళ గదిలోకి ప్రవేశించి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఈవారం ప్రారంభంలో రాడిసన్ హోటల్ లండన్ హీత్రోలో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఆ క్రమంలో సహాయం కోసం ఆమె కేకలు వేసింది. దీంతో పక్క గదుల్లోని సహోద్యోగులు వచ్చి దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. ఆ తర్వాత గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


సెక్యూరిటీ

సిబ్బంది నిద్రిస్తుండగా తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు. దిగ్భ్రాంతి చెందిన ఆమె మేల్కొని సహాయం కోసం అరిచింది. ఆమె తలుపు వైపు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు దుండగుడు బట్టల హ్యాంగర్‌తో ఆమెపై దాడి చేశాడని ఆయా వర్గాలు తెలిపాయి. ఆ క్రమంలో చొరబాటుదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే దాడి జరిగిన సమయంలో హోటల్‌లో సెక్యూరిటీ లేకుండా పోయారు. దీంతో అంత మంది మహిళలు ఉన్న హోటళ్లో సెక్యూరిటీ లేకపోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదృష్టవశాత్తూ సిబ్బంది స్నేహితులు వెంటనే అప్రమత్తం కావడంతో ఆమెను త్వరగా రక్షించగలిగారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా కూడా స్పందించింది.

ఇవి కూడా చదవండి:

Rain Alert: 15 రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. కొనసాగుతున్న విధ్వంసం


సిబ్బంది భద్రత

ఎయిర్ ఇండియా.. మా సిబ్బంది భద్రత, శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. మా సిబ్బందిని ప్రభావితం చేసిన ఈ ఘటనపై మేము తీవ్ర వేదన చెందాము. మేము ప్రొఫెషనల్ కౌన్సెలింగ్‌తో సహా మా సహోద్యోగికి, వారి విస్తృత బృందానికి సాధ్యమైన అన్ని రకాల మద్దతును అందిస్తున్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఈ ఘటనపై స్థానిక పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. దీంతోపాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు ఆమె భారత్‌కు తిరిగి వచ్చిందని, ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని ఎయిర్ ఇండియా సిబ్బంది తెలిపారు.


ఇవి కూడా చదవండి:


Kolkata : హోరెత్తిన వైద్యుల నిరసన


Delhi : కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ సింఘ్వీ


Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 11:00 AM