Share News

Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

ABN , Publish Date - Oct 20 , 2024 | 08:35 AM

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ విషాధ ఘటన రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
Auto bus accident 12 people died

రాజస్థాన్‌(Rajasthan)లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్లీపర్‌ కోచ్‌ బస్సు, టెంపో ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కరౌలి-ధోల్‌పూర్ హైవే NH-11Bలోని సునిపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. టెంపో రైడర్ బారీ నగరంలోని గుమత్ మొహల్లా నివాసిగా గుర్తించారు. అయితే అందులోని ప్రయాణికులు బరౌలి గ్రామంలో పెళ్లి కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


మృతుల్లో

మృతి చెందిన వారిలో 14 ఏళ్ల అస్మా, 8 ఏళ్ల సల్మాన్, 6 ఏళ్ల సకీర్, 10 ఏళ్ల డానిష్, 5 ఏళ్ల అజాన్, 19 ఏళ్ల అషియానా, 7 ఏళ్ల సుఖి, 9 ఏళ్ల సనీఫ్ ఉన్నారు. వీరు కాకుండా ప్రమాదంలో ఇద్దరు మహిళలు, 35 ఏళ్ల జరీనా, 32 ఏళ్ల జూలీ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 38 ఏళ్ల ఇర్ఫాన్ అలియాస్ బంటీ కూడా ప్రమాదంలో మరణించాడు. కరీం కాలనీకి చెందిన నహ్ను, జహీర్‌ల కుటుంబ సభ్యులు బరౌలి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంగా ప్రమాదం జరిగినట్లు బారీ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.


కారణమిదేనా

గాయపడిన వారిలో బస్సు ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. ఈరోజు అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రమాదానికి కారణమైన రెండు వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు కేసు దర్యాప్తు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణలో అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


కుటుంబీకులు

ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హృదయ విదారకమైన ఈ ఘటన యావత్ ప్రాంతాన్ని కలచివేసింది. గత కొన్ని రోజులుగా హైవే ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఓ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు కారు, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఐదు మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో యాక్సిడెంట్ జరగడం చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి:

India A: ఉత్కంఠ మ్యాచ్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్


SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Read More National News and Latest Telugu News

Updated Date - Oct 20 , 2024 | 08:54 AM