Share News

Owaisi: బంతి వాళ్ల కోర్టులోనే ఉంది.. 'ఇండియా' కూటమితో పొత్తుపై ఒవైసీ

ABN , Publish Date - Oct 18 , 2024 | 06:12 PM

ఎన్డీయేకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్‌కు తమ పార్టీ లేఖ రాసినట్టు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని అన్నారు.

Owaisi: బంతి వాళ్ల కోర్టులోనే ఉంది.. 'ఇండియా' కూటమితో పొత్తుపై ఒవైసీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections) 'ఇండియా' (INDIA) కూటమితో పొత్తుకు ఏఐంఎంఐఎం (AIMIM) సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సంకేతాలిచ్చారు. ఎన్డీయేకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్‌కు తమ పార్టీ లేఖ రాసినట్టు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని అన్నారు.

Jharkhand: అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయేకు గట్టి దెబ్బ


''మేము కూడా మహారాష్ట్రలో షిండే-ఫడ్నవిస్ ప్రభుత్వం రావాలని కోరుకోవడం లేదు. దీనిపై నానా పటోలే, శరద్ పవార్‌కు మా పార్టీ మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ లేఖ రాశారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. ఇంతకంటే మేము ఏమి చేయగలం?'' అని మీడియాతో మాట్లాడుతూ ఒవైసీ చెప్పారు.


మహారాష్ట్రలో ఏఐఎంఐఎంకు గట్టి ఉనికి ఉందని, 2019 ఎన్నికల్లో రెండు సీట్లు కూడా తాము గెలుచుకున్నామని ఆయన గుర్తు చేశారు. మరాఠా రిజర్వేషన్ పోరాట నేత జారంగే పాటిల్‌ను కూడా సంప్రదిస్తున్నామని, నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని చెప్పారు. ఏదిఏమైనా ఎన్నికల్లో ఏఐఎంఐఎం పోటీలో ఉంటుందని స్పష్టంచేశారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తేలిగ్గా గెలిచే అవకాశం ఉన్నా గెలవలేదని అన్నారు. అందుకు కారణాలపై విశ్లేషించుకోవాలని, అయినప్పటికీ కూడా మహారాష్ట్రలో మా ప్రయత్నాలు (పొత్తు) చేస్తున్నామని, బంతి వాళ్ల కోర్టులోనే ఉందని చెప్పారు.


పోరు రెండు కూటముల మధ్యే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ప్రధానంగా రెండు కూటముల మధ్యే ఉంది. అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఉండగా, విపక్ష మహా వికాస్ అఘాడిలో శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ శరద్ పవార్, కాంగ్రెస్ ఉన్నాయి. 2019లో బీజేపీ, అవిభక్త శివసేన కూటమి అధికారంలోకి వచ్చింది. 288 సీట్లలో బీజేపీ 105 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలవగా, శివసేన 56 సీట్లు, ఎన్‌సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్నాయి. బహుజన్ వికాస్ అఘాడి 3, ఏఐఎంఐఎం, సమాజ్‌వాదీ పార్టీలు చెరో రెండు సీట్లు గెలుచుకున్నాయి. ఎనిమిది చిన్న పార్టీలు ఒక్కో సీటు చొప్పున గెలుపొందగా, ఇండిపెండెంట్లు 13 సీట్లలో గెలిచారు. కాగా, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20న ఒకే విడతలో జరుగనుండగా, 23న ఫలితాలు వెలువడతాయి.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

Updated Date - Oct 18 , 2024 | 06:12 PM