Bangalore: రేణుకాస్వామి హంతకులను కఠినంగా శిక్షించాలి..
ABN , Publish Date - Jun 20 , 2024 | 12:29 PM
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని(Renukaswamy) హత్య చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వీరశైవ జంగమ సమాజం నాయకులు డిమాండ్ చేశారు. రేణుకాస్వామిని హత్యను నిరశిస్తు వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం లింగసుగూరు పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
- వీరశైవ జంగమ సమాజం డిమాండ్
- నటుడు దర్శన్ దిష్టిబొమ్మ దహనం
రాయచూరు(బెంగళూరు): చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని(Renukaswamy) హత్య చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వీరశైవ జంగమ సమాజం నాయకులు డిమాండ్ చేశారు. రేణుకాస్వామిని హత్యను నిరశిస్తు వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం లింగసుగూరు పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులు నటుడు దర్శన్(Darshan) దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ఇటీవల జరిగిన స్నేహ హిరేమఠ హత్యను మరువక ముందే రేణుకాస్వామిని హత్య చేయడం రాష్ట్రంలో వీరశైవ జంగమ సమాజానికి ఎదురవుతున్న ముప్పును తెలియజేస్తున్న దన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి నిందితులను శిక్షించాలని రేణుకాస్వామి కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చిత్రదుర్గలోని అపోలో ఆస్పత్రిలో పని చేస్తున్న రేణుకాస్వామి బెంగళూరులో మృతుడిగా పడి ఉండడం పలు అనుమానాలకు తావిచ్చిందన్నారు. దుండగులు ఆయనను దారుణంగా హత్య చేసి పారవేసి వెళ్లారని దీనిపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదికూడా చదవండి: Chennai: ‘మాస్’ మాజీ అధ్యక్షుడు జగ్గయ్య కన్నుమూత...
కేసు పుర్వాపరాలు: కన్నడ యాక్టర్ పవిత్ర గౌడ మొబైల్‌కు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించాడు. పవిత్ర గౌడ రేణుకాస్వామి నెంబర్ ను బ్లాక్ చేసినా కొత్త నెంబర్ నుంచి మెసేజ్‌లు పంపేవాడు. ఇలాంటి టార్చర్ భరించలేనని పవిత్ర గౌడ తన ఇంటి పనిమనిషి పవన్‌కు విషయం చెప్పింది. ఈ విషయాన్ని పవన్ సినీ నటుడు దర్శన్‌కు చెప్పాడు. దీంతో చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరులోని ఒక షెడ్డులో ఉంచి సినీ నటుడు దర్శన్ ఆయన అనుచరులు ఆయనను విపరీతంగా కొ ట్టడంతో రేణుకాస్వామి మృతిచెందాడని తెలుస్తోంది. అనంతరం దర్శన్ ఆదేశాల మేరకు మరో ఐదుగురు కిరాయిమనుషులు మృతదేహాన్ని తీసుకెళ్లి డ్రైనేజి కాల్వలో పడేశారు. పోలీసులు నటుడు దర్శన్‌తో పాటు అతని అనుచరులైన మరో 17 మందిని అరెస్టు చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News