Share News

Bharat Bandh: నేడు భారత్ బంద్.. స్కూళ్లు, బ్యాంకులు తెరిచే ఉంటాయా..

ABN , Publish Date - Aug 21 , 2024 | 07:17 AM

ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు(supreme court) ఇటీవల ఇచ్చిన నిర్ణయానికి నిరసనగా నేడు (ఆగస్టు 21న) భారత్ బంద్‌కు(Bharat Bandh) ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అయితే స్కూల్స్, బ్యాంకులు బంద్ ఉంటాయా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Bharat Bandh: నేడు భారత్ బంద్.. స్కూళ్లు, బ్యాంకులు తెరిచే ఉంటాయా..
Bharat bandh today

ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు(supreme court) ఇటీవల ఇచ్చిన నిర్ణయానికి నిరసనగా నేడు (ఆగస్టు 21న) భారత్ బంద్‌కు(Bharat Bandh) ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని SC/ST సమూహాల మద్దతుతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ బంద్‌లో పాల్గొంటారని ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. నిరసనల సమయంలో శాంతిభద్రతలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించారు. అయితే భారత్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఆగస్ట్ 21న బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, స్కూళ్లు తెరిచి ఉంటాయా లేదా అనే ప్రశ్న ప్రజల మదిలో మొదలైంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


బ్యాంకులు, పాఠశాలలు

భారత్ బంద్ దృష్ట్యా కేవలం రాజస్థాన్‌లో మాత్రమే పాఠశాలలను మూసివేశారు. ఇక దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖలు ఆగస్టు 21, 2024న తెరిచి ఉంటాయి. కానీ అన్ని వ్యాపార సంస్థలను మూసివేయాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ భవనాలు, పోస్టాఫీసులు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, గ్యాస్ స్టేషన్లు సాధారణంగా పనిచేస్తాయి. ఇవి కాకుండా వైద్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, రైలు సేవలు, ప్రజా రవాణా, విద్యుత్ సరఫరా వంటి అవసరమైన సేవలు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. మరోవైపు బుధవారం స్టాక్ మార్కెట్లు కూడా తెరిచి ఉంటాయి. దీనికి సంబంధించి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నుంచి బంద్ గురించి ఎటువంటి ప్రత్యేక సమాచారం అందించలేదు. అంటే స్టాక్ మార్కెట్లు సాధారణ రోజుల మాదిరిగానే పనిచేస్తాయి.


న్యాయం చేయాలి

అట్టడుగు వర్గాలకు బలమైన ప్రాతినిధ్యం, రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత, గిరిజన సంస్థలు బుధవారం (ఆగస్టు 21) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్స్ (NACDAOR) షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతుల (OBC)లకు సమానత్వంతో కూడిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) కూడా వ్యతిరేకించింది. బీఎస్పీ ఆధ్వర్యంలో భారత్ బంద్ కూడా జరగనుంది. అనేక వర్గాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయని, ఎలాంటి హింసాకాండకు తావులేకుండా శాంతియుతంగా పాటించాలని విజ్ఞప్తి చేశామని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు.


మద్దతు

బంద్‌కు మద్దతు ఇస్తూ బహుజనుల బలాన్ని చాటేందుకు ఎస్సీ ఎస్టీ క్రీమీలేయర్ వర్గీకరణ, పలు సమస్యలపై పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని నగీనా ఎంపీ, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఆగస్టు 21 బుధవారం భారత్ బంద్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి 'భారత్ బంద్' సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. భీమసేన అధినేత నవాబ్ సత్పాల్ తన్వర్ పేరుతో ఓ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వేషన్లకు విరుద్ధమని అంటున్నారు. ఉప వర్గాలను సృష్టించడం ద్వారా వెనుకబడిన కులాలు ముందుకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

CV Ananda Bose : బెంగాల్లో అనిశ్చితి

ఎంపాక్స్‌ చికిత్సకు మార్గదర్శకాలు


Read More National News and Latest Telugu News

Updated Date - Aug 21 , 2024 | 09:34 AM