Share News

Bole Baba: వారి వైద్య ఖర్చులు ట్రస్టే భరిస్తుంది.. భోలే బాబా లాయర్ వివరణ

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:04 PM

సత్సంగ్ కార్యక్రమం నిర్వహించి 121 మంది మృతికి కారణమైన భోలే బాబా పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ వైపు పోలీసుల విచారణకు సహకరిస్తామని చెబుతూనే మరోవైపు పరారీలో ఉన్నాడు.

Bole Baba: వారి వైద్య ఖర్చులు ట్రస్టే భరిస్తుంది.. భోలే బాబా లాయర్ వివరణ

ఢిల్లీ: సత్సంగ్ కార్యక్రమం నిర్వహించి 121 మంది మృతికి కారణమైన భోలే బాబా పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ వైపు పోలీసుల విచారణకు సహకరిస్తామని చెబుతూనే మరోవైపు పరారీలో ఉన్నాడు. అయితే బాధిత కుటుంబాలకు ఇప్పుడు ఆధారం లేకుండా పోయింది.

నామమాత్ర పరిహారం ప్రకటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిపెట్టుకున్నాయి. వారి కుటుంబాల భవిష్యత్తు ఏంటని భోలేబాబా లాయర్ ఏపీ సింగ్‌ని ప్రశ్నించగా.. మృతుల జాబితాలు తమ వద్ద ఉన్నట్లు చెప్పారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాల పిల్లల చదువు, ఆరోగ్యం, పెళ్లి ఖర్చులను భోలే బాబాకు చెందిన నారాయణ్ సాకర్ హరి ట్రస్టే భరిస్తుందని వివరించారు.


ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎలాంటి సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో సమావేశానికి లక్షల్లో హాజరైనట్లు చెప్పారు. 80 వేలకు అనుమతి ఉండగా.. లక్షల్లో హాజరైనట్లు తెలిపారు. భోలే బాబా పరారీలో లేడని.. విచారణకు అతను సహకరిస్తారని లాయర్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు వాలంటీర్లను అరెస్ట్ చేశారు. కాగా బాబా పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

For More National News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 10:05 PM