UP: భోలేబాబాకు రూ.100 కోట్ల ఆస్తులు
ABN , Publish Date - Jul 06 , 2024 | 03:53 AM
హత్రా్‌సలో తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాకు దాదాపు రూ.100కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. పలు ఆశ్రమాలు, నివాసాలు, ఇతర స్థిరాస్తులు, వాహనాల రూపంలో ఇవి ఉన్నట్లు తేలింది.
జాబితాలో ఆశ్రమాలు,
స్థిరాస్తులు, ఖరీదైన వాహనాలు
హత్రాస్, జూలై5: హత్రాస్ లో తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాకు దాదాపు రూ.100కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. పలు ఆశ్రమాలు, నివాసాలు, ఇతర స్థిరాస్తులు, వాహనాల రూపంలో ఇవి ఉన్నట్లు తేలింది. వీటిలో ముఖ్యమైనది యూపీలోని మొయిన్‌పురిలో ఉన్న ఆశ్రమం.
ఇది ఫైవ్‌స్టార్ హోటల్ స్థాయిలో ఉంటుంది. దీన్ని కట్టిన స్థలమే రూ.4కోట్ల విలువ చేస్తుందని సమాచారం. భోలేబాబాగా పేరొందిన సూరజ్‌పాల్ ఉండేది ఈ ఆశ్రమంలో నిర్మించిన నివాసంలోనే.
ఆశ్రమానికి ఆనుకొని ఉన్న 16 ఎకరాలకుపైగా స్థలాన్ని సూరజ్‌పాల్ లీజుకు తీసుకు న్నాడు. ఆగ్రా, కాన్పూర్, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లో భోలేబాబా ఆశ్రమాలున్నాయి. అనేక ఖరీదైన, లగ్జరీ కార్లు ఆయనకున్నాయి. ఇటీవల సత్సంగ్ తర్వాత అలాంటి ఓ వాహనంలో ఆయన వెళ్లిపోతుంటే ఆ మార్గంలో మట్టి కోసం జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగి 121మంది మరణించారు.