Share News

BJP: 20 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల మార్పు?

ABN , Publish Date - Aug 04 , 2024 | 12:35 PM

తమిళనాడు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుల్లో 20 మందిని మార్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(State President K. Annamalai) నిర్ణయించారు. ఇటీవల ఆయన ఢిల్లీ(Delhi)కి వెళ్ళిన ఆయన... అక్కడ పార్టీ పెద్దలతో వివిధ అంశాలతో పాటు పార్టీ బలోపేతంపై సుధీర్ఘంగా చర్చించి, మళ్ళీ రాష్ట్రానికి చేరుకున్నారు.

BJP: 20 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల మార్పు?

- అన్నామలై సంచలన నిర్ణయం

చెన్నై: తమిళనాడు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుల్లో 20 మందిని మార్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(State President K. Annamalai) నిర్ణయించారు. ఇటీవల ఆయన ఢిల్లీ(Delhi)కి వెళ్ళిన ఆయన... అక్కడ పార్టీ పెద్దలతో వివిధ అంశాలతో పాటు పార్టీ బలోపేతంపై సుధీర్ఘంగా చర్చించి, మళ్ళీ రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు.

ఇదికూడా చదవండి: ‘మీ పేరుతో డ్రగ్స్‌ పార్సిల్‌ దొరికిందంటూ.. క్రైమ్‌ బ్రాంచ్ పోలీసుల్లా..


ఇందులోభాగంగా ఆ పార్టీకి ఉన్న 66 మంది జిల్లా అధ్యక్షుల్లో 20 మందిని మార్చాలని ఆయన భావిస్తున్నారు. కాగా, ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ(BJP) పోటీ చేసిన స్థానాల్లో ఒక సీటులో కూడా గెలవలేదు. కానీ, 12 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలన్న తలంపులో ఆయన ఉన్నారు. ఆ దిశగా పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సంసిద్ధులను చేయనున్నారు.

nani1.2.jpg


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 04 , 2024 | 12:35 PM