Share News

Central government : ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.8,263 కోట్ల జీఎస్టీ

ABN , Publish Date - Aug 06 , 2024 | 05:40 AM

ఆరోగ్య బీమా ప్రీమియంపై పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూలు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఇది ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమైంది.

Central government : ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.8,263 కోట్ల జీఎస్టీ

  • గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వసూలు

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఆరోగ్య బీమా ప్రీమియంపై పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూలు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఇది ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమైంది. గడచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఆరోగ్య బీమా ప్రీమియంపై ప్రభుత్వం రూ.8,263 కోట్ల జీఎస్టీని వసూలు చేసింది.

అలాగే హెల్త్‌ రీఇన్సూరెన్స్‌ ప్రీమియంపై జీఎస్టీతో రూ.1,484.36 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. 2022-23లో ఆరోగ్య బీమా ప్రీమియం నుంచి జీఎస్టీ వసూళ్లు రూ.7,638 కోట్లు ఉండగా.. హెల్త్‌ రీఇన్సూరెన్స్‌ ప్రీమియంపై జీఎస్టీతో మరో రూ.963 కోట్లు వచ్చాయి. జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ రేటును మినహాయించాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఇటీవల ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

Updated Date - Aug 06 , 2024 | 05:40 AM