Share News

Chennai: బెంగళూరు కోర్టుకు మంత్రి ఉదయనిధి హాజరు...

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:44 PM

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఉదయనిధి((Minister Udayanidhi)కి బెంగళూరు న్యాయస్థానం నిబంధనలతో కూడిన బెయిలు మంజూరు చేసింది. నగరంలో గత ఏడాది సెప్టెంబరు 20వ తేది ‘సనాతన నిర్మూలన మహానాడు’ జరిగింది.

Chennai: బెంగళూరు కోర్టుకు మంత్రి ఉదయనిధి హాజరు...

- నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు

చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి బెంగళూరు న్యాయస్థానం నిబంధనలతో కూడిన బెయిలు మంజూరు చేసింది. నగరంలో గత ఏడాది సెప్టెంబరు 20వ తేది ‘సనాతన నిర్మూలన మహానాడు’ జరిగింది. ఈ మహానాడులో పాల్గొన్న మంత్రి ఉదయనిధి.. డెంగ్యూ, మలేరియాల్లానే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. దీనిపై దేశవ్యాప్తంగా పలు హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు 8 కేసులు నమోదయ్యాయి. ఉదయనిధిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలంటూ బెంగళూరుకు చెందిన రమేష్‌ బెంగళూరులోని ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. ఈ 8 కేసులు వేర్వేరు రాష్ట్రాల్లో దాఖలైన నేపథ్యంలో, అన్నింటినీ ఒకటిగా చేర్చి ఒకే ప్రాంతంలో విచారించాలని కోరుతూ ఉదయనిధి తరఫున న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. ముఖ్యంగా, ఉదయనిధితో పాటు, సనాతన ధర్మ నిర్మూలన మహానాడు ఏర్పాటుచేసిన వెంకటేష్‌, ఆదవన్‌, మధుకూర్‌ రామలింగం తదితరులపై కూడా క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని రమేష్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Chennai: వేప చెట్టు నుంచి పాలు.. భక్తుల పరవశం


న్యాయస్థానంలో ఉదయనిధి హాజరు...

ఈ పిటిషన్‌కు వ్యతిరేకంగా వెంకటేష్‌, ఆధవన్‌, మధుకూర్‌ రామలింగం తదితరులు కర్ణాటక హైకోర్టులో క్రిమినల్‌ చర్యలపై స్టే విధించాలని కోరుతూ గత వారం పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణా ఎస్‌.దీక్షిత్‌, ఈ కేసులో క్రిమినల్‌ చర్యలు చేపట్టడంపై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి బెంగళూరు న్యాయస్థానంలో హాజరయ్యారు.


ఆగస్టు 8కి వాయిదా...: ఉదయనిధితో హాజరైన సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌, ఆయనకు బెయిలు మంజూరు చేయాలని, కేసు విచారణకు నేరుగా హాజరుకావడంపై శాశ్వతంగా మినహాయింపు ఇవ్వాలని వేర్వేరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు అంగీకరించిన న్యాయమూర్తి శరవణ.. ఉదయనిధికి బెయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని కేసులు ఒకటిగా విచారించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన అనంతరం, ఈ కేసు విచారణ చేపడతానని ప్రకటిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 8వ తేదీకి వాయిదావేశారు. కాగా, బెంగళూరుకు న్యాయస్థానంలో మంత్రి ఉదయనిధి హాజరవుతుండడంతో కోర్టు ప్రాంగణంలో భారీ పోలీసు భద్రత ఏర్పాటుచేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 12:44 PM