Share News

Chennai: అకాల వర్షాలు.. ఐదు రోజుల్లో 11 మంది మృతి

ABN , Publish Date - May 22 , 2024 | 11:58 AM

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కన్నియాకుమారి, కోయంబత్తూరు, తిరునెల్వేలి, నీలగిరి(Kanniyakumari, Coimbatore, Tirunelveli, Nilgiris) జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలను జారీ చేసింది.

Chennai: అకాల వర్షాలు.. ఐదు రోజుల్లో 11 మంది మృతి

- పలు జిల్లాలకు సర్కారు హెచ్చరిక

చెన్నై: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కన్నియాకుమారి, కోయంబత్తూరు, తిరునెల్వేలి, నీలగిరి(Kanniyakumari, Coimbatore, Tirunelveli, Nilgiris) జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలను జారీ చేసింది. వర్ష ప్రభావిత జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా 296 మందితో కూడిన పది విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచింది. వాతావరణంలో మార్పుల కారణంగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని 37 జిల్లాల్లో వర్షాలు కురవగా, గరిష్టంగా నామక్కల్‌ జిల్లాలో 7.12 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదైనట్టు రెవెన్యూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ప్రకటించింది.

ఇదికూడా చదవండి: Chennai: కొత్తరకం కరోనా వైరస్‏పై ఆందోళన వద్దు...


మంగళవారం కూడా తిరుచ్చి, తిరునల్వేలి, కోయంబత్తూరు తదితర జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. తిరుచ్చి జిల్లా శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలోకి భారీగా వరదనీరు ప్రవేశించింది. కాగా వర్ష హెచ్చరికల నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో ముందస్తు హెచ్చరికలు చేపట్టారు. అలాగే, పశ్చిమ కనుమల్లోని కన్నియాకుమారి, తిరునెల్వేలి, తెన్‌కాశి, దిండిగల్‌, కోయంబత్తూరు, నీలగిరి, విరుదునగర్‌, తేని, తిరుచ్చి జిల్లాలకు భారీ వర్షసూచనలతో ఈ జిల్లాల వాసులకు ముందస్తు జాగ్రత్తలకు సంబంధించి ఎస్‌ఎంఎ్‌సలు పంపించారు. అలాగే, వర్షబాధిత జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా 296 మంది నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బందిని పది బృందాలను సిద్ధం చేసి, కన్నియాకుమారి, కోయంబత్తూరు, తిరునెల్వేలి, నీలగిరి జిల్లాల్లో సిద్ధంగా ఉంచారు.

ఇదికూడా చదవండి: Lok Sabha Polls 2024: బీహార్‌పై మోదీ స్పెషల్ ఫోకస్.. కారణమిదేనా..?


గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో గత ఐదు రోజుల్లో 11 మంది మృతి చెందారు. అలాగే, గత 24 గంటల్లో 12 పశువులు చనిపోగా, 24 గుడిసెలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని కోస్తాతీర ప్రాంతం, కన్నియాకుమారి, గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల జాలర్లు సముంద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని, సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు ఈ నెల 23వ తేదీలోపు తీరానికి చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 22 , 2024 | 11:58 AM