Share News

CM Stalin: కొడనాడు కేసును ఇంటర్‌పోల్‌ సాయంతో విచారణ జరపాలి

ABN , Publish Date - Jun 30 , 2024 | 12:13 PM

నీలగిరి జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన కొడనాడు ఎస్టేట్‌(Kodanadu Estate)లో జరిగిన హత్య, దోపిడీ తదితర ఘటనలకు సంబంధించిన కేసును ఇంటర్‌పోల్‌ సాయంతో విచారణ జరపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) పేర్కొన్నారు.

CM Stalin: కొడనాడు కేసును ఇంటర్‌పోల్‌ సాయంతో విచారణ జరపాలి

- సీఎం స్టాలిన్‌

చెన్నై: నీలగిరి జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన కొడనాడు ఎస్టేట్‌(Kodanadu Estate)లో జరిగిన హత్య, దోపిడీ తదితర ఘటనలకు సంబంధించిన కేసును ఇంటర్‌పోల్‌ సాయంతో విచారణ జరపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) పేర్కొన్నారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించి కొత్త పథకాలను ప్రకటించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌, కొడనాడు కేసుకు సంబంధించి మాట్లాడారు. కొడనాడు కేసును రాష్ట్రప్రభుత్వం కీలకమైన కేసుగా పరిగణలోకి తీసుకుందని, ఈ కేసులో ఇప్పటివరకు 268 సాక్షుల వద్ద విచారణ జరిపినట్లు తెలిపారు.

ఇదికూడా చదవండి: Tamilisai: మాజీ గవర్నర్‌ తమిళిసైకి జాతీయ స్థాయి పదవి?


nani3.2.jpg

నిందితులు ఉపయోగించిన 8 సెల్‌ఫోన్లు, నాలుగు సిమ్‌కార్డులను కోయంబత్తూర్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఈ ల్యాబ్‌ నుంచి 8,000 పేజీల నివేదిక పొందామని, సంఘటన జరిగిన సమయంలో కొంతమంది నిందితులకు విదేశాల నుంచి సెల్‌ఫోన్‌ కాల్స్‌ వచ్చాయన్నారు అందువల్లే ఈ కేసులో ఇంటర్‌పోల్‌ సాయంతో విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 12:13 PM