Congress: రూ.500కే సిలిండర్, ఉచిత విద్యుత్
ABN , Publish Date - Sep 18 , 2024 | 03:48 PM
ప్రజలకు హర్యానా కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. పేద, మధ్య తరగతి, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరోసారి పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. పేద, మధ్య తరగతి, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరోసారి పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించింది. రాష్ట్రంలో కుల గణన చేపడుతామని స్పష్టం చేసింది. కుల గణన ఆధారంగా రూ.500కు సిలిండర్ అందజేస్తామని ప్రకటన చేసింది. హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చేనెల 5వ తేదీన అసెంబ్లీకి ఎన్నిక జరగనున్నాయి. 8వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
హామీలు
-300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
-రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం
మహిళా సాధికారత కోసం
-మహిళలకు నెలకు రూ.2 వేలు
-రూ.500కే గ్యాస్ సిలిండర్
యువత భవితకు భద్రత
-2 లక్షల ఉద్యోగాల నియామకం
-డ్రగ్స్ ఫ్రీగా హర్యానా రాష్ట్రం
సామాజిక భద్రత బలోపేతం
-వృద్దులకు రూ.6 వేల పెన్షన్
-వికలాంగులకు రూ.6 వేల పెన్షన్
-వితంతులకు రూ.6 వేల పెన్షన్
-పాత పెన్షన్ స్కీం పునరుద్దరణ
బీసీల హక్కులు
-కుల గణన నమోదు
-క్రిమిలేయర్ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు
రైతుల కోసం
-పంటలకు కనీస మద్దతు ధర
-వెంటనే పంట నష్ట పరిహారం అందజేత
పేదలకు ఇళ్లు
-100 గజాల్లో పేదలకు ఇళ్లు
-రెండు గదుల ఇంటి కోసం రూ.3.5 లక్షలు ఇస్తాం.
హర్యానా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. పేద, మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని హామీలు ఇచ్చింది.