Share News

Srinagar Grenade Attack: ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం.. బలగాలకు ఎల్జీ మనోజ్ సిన్హా ఆదేశాలు

ABN , Publish Date - Nov 03 , 2024 | 09:21 PM

శ్రీనగర్‌లోని గ్రనేడ్ దాడిపై డీజీపీ నలిన్ ప్రభాత్, భద్రతా ఏజెన్సీల సీనియర్ అధికారుతో లెఫ్టినెంట్ గవర్నర్ మాట్లాడినట్టు ఆయన కార్యాలయ ప్రతినిధి ఒకరు తెలిపాయి. టెర్రరిస్టులను, వారి అసోసియేట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్టు చెప్పారు.

Srinagar Grenade Attack: ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం.. బలగాలకు ఎల్జీ మనోజ్ సిన్హా ఆదేశాలు

శ్రీనగర్: ఉగ్రవాదులకు దీటుగా సమాధానం ఇవ్వడంతో పాటు ఉగ్రవాద సంస్థలను ఉక్కుపాదం అణిచివేయాలని భద్రతా బలగాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (LG) మనోజ్ సిన్హా (Manoj Sinha) స్పష్టమైన ఆదేశాలిచ్చారు. శ్రీనగర్‌లోని రద్దీగా ఉండే సండే మార్కెట్‌ సమీపంలోని సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై ఉగ్రవాదులు ఆదివారంనాడు గ్రనేడ్ విసరడంతో 12 మంది పౌరులు గాయపడిన నేపథ్యంలో మనోజ్ సిన్హా తాజా ఆదేశాలిచ్చారు.

Jaishankar: ఇండో-చైనా బలగాల ఉపసంహరణ స్వాగతించదగిన పరిణామం


శ్రీనగర్‌లోని గ్రనేడ్ దాడిపై డీజీపీ నలిన్ ప్రభాత్, భద్రతా ఏజెన్సీల సీనియర్ అధికారుతో లెఫ్టినెంట్ గవర్నర్ మాట్లాడినట్టు ఆయన కార్యాలయ ప్రతినిధి ఒకరు తెలిపాయి. టెర్రరిస్టులను, వారి అసోసియేట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్టు చెప్పారు. పౌరులపై దాడులు జరిపిన వారు భారీ మూల్యం చెల్లించక తప్పదని, ఉగ్రసంస్థలను సమూలంగా మట్టుబెట్టేందుకు బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు కూడా ఎల్జీ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు.


సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండన

కాగా, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని గ్రనేడ్ దాడి జరపడం ఎంతమాత్రం సమ్మతం కాదని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా దాడులు, ఎన్‌కౌంటర్ల వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయని, ఈరోజు శ్రీనగర్‌ సండే మార్కెట్ దుకాణదారులపై గ్రనేడ్ దాడి జరిగిందని అన్నారు. అమాయక పౌరులను లక్ష్యంగా దాడులు జరపడం సమర్ధనీయం కాదన్నారు. భద్రతా బలగాలు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుని ఈ తరహా దాడులరు చరమగీతం పాడాలని కోరారు. శ్రీనగర్‌లోని ఖాన్యార్ ప్రాంతంలో లష్కరే తొయిబా కమాండర్ ఒకరని భద్రతా బలగాలు శనివారంనాడు మట్టుబట్టిన మరుసటి రోజే ఆదివారంనాడు గ్రనేడ్ దాటి చోటుచేసుకుంది.


ఇవి కూడా చదవండి:

No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన

Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పీంఛన్ పెంపు చేస్తాం

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 03 , 2024 | 09:22 PM