Share News

Delhi : మోదీకి యూనస్‌ ఫోన్‌.. హిందువుల భద్రతపై హామీ

ABN , Publish Date - Aug 17 , 2024 | 03:01 AM

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు యూనస్‌ శుక్రవారం ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. బంగ్లాలోని పరిస్థితులపై వారు చర్చించారు.

Delhi : మోదీకి యూనస్‌ ఫోన్‌.. హిందువుల భద్రతపై హామీ

న్యూఢిల్లీ, హరిద్వార్‌, ఆగస్టు 16: బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు యూనస్‌ శుక్రవారం ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. బంగ్లాలోని పరిస్థితులపై వారు చర్చించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న హిందువులు, మైనారిటీల భద్రత గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు.

వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని యూనస్‌ హామీ ఇచ్చారని మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం హరిద్వార్‌లో సాధువులు నిరసన వ్యక్తం చేశారు.

హిందువులపై హింస వెంటనే ఆపకపోతే బంగ్లాదేశ్‌కు పాదయాత్ర చేస్తామని వారు హెచ్చరించారు. మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేలా కృషి చేయాలని ప్రధాని మోదీ శుక్రవారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూను ఫోన్లో కోరారు.

Updated Date - Aug 17 , 2024 | 03:01 AM