Share News

Delhi: ఏఐతో కాంగ్రెస్‌ కుట్ర..

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:47 AM

మద్యం విధానం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Delhi: ఏఐతో కాంగ్రెస్‌ కుట్ర..

  • మా ప్రసంగాలను వక్రీకరిస్తూ వీడియోలు

  • కాంగ్రెస్‌ది దివాలా కోరు విధానం

  • బీజేపీని నేరుగా ఢీకొనలేక కుతంత్రాలు

  • ఈసీ వీటిని తీవ్రంగా పరిగణించాలి

  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. ఫిర్యాదు చేయాలి

  • ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

  • తెలంగాణ, కర్ణాటకల్లోనూ అదే తీరు

  • సంపద పంపిణీ అర్బన్‌ నక్సల్‌ ఆలోచన: మోదీ

  • విచారణకు రాలేదని అరెస్టా?

  • ఇన్నేళ్లు ఆగి ఎన్నికల ముందే ఎందుకు?

  • కేజ్రీవాల్‌ అరెస్టుపై సుప్రీంకోర్టులో వాదనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): మద్యం విధానం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ కోసమే అయితే ముందుగా ట్రయల్‌ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ సమాధానం ఇస్తూ బెయిల్‌ కోసం తాము ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయలేదని తెలిపారు.


అరెస్టు అక్రమమని చెప్పడానికి మాత్రమే పిటిషన్‌ వేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాదనలు కొనసాగిస్తూ ‘‘2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్టు చేయడం సరికాదు. ఏళ్ల తరబడి స్పందించని ఈడీ ఎన్నికలకు ముందే అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎటువంటి ఆధారం లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేయడం సరికాదు.


ముఖ్యమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టినా, సాధారణమైన వ్యక్తిని కూడా అలా అరెస్టు చేయకూడదు. ముఖ్యమంత్రికి కూడా ఇతర వ్యక్తుల వలే హక్కులు ఉంటాయి. వాటిని ఈడీ ఎక్కడా పాటించలేదు. విచారణకు హాజరు కావడంలేదనే సాకుతో అరెస్టు చేయడం సమంజసం కాదు‘‘ అని అన్నారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు హాజరయ్యారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Updated Date - Apr 30 , 2024 | 03:47 AM