Share News

Delhi : జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంటులో మంటలు

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:37 AM

ఐరోపా ఖండంలోనే అతిపెద్ద న్యూక్లియర్‌ విద్యుత్తు కేంద్రమైన జపోరిజియాలో ఆదివారం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడుల వల్లే ప్లాంట్‌లో మంటలు చెలరేగాయని రష్యా ఆరోపించగా.. ప్లాంట్‌లో కూలింగ్‌ టవర్స్‌లో మంటలకు రష్యానే కారణమని ఉక్రెయిన్‌ పేర్కొంది.

Delhi : జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంటులో మంటలు

న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఐరోపా ఖండంలోనే అతిపెద్ద న్యూక్లియర్‌ విద్యుత్తు కేంద్రమైన జపోరిజియాలో ఆదివారం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడుల వల్లే ప్లాంట్‌లో మంటలు చెలరేగాయని రష్యా ఆరోపించగా.. ప్లాంట్‌లో కూలింగ్‌ టవర్స్‌లో మంటలకు రష్యానే కారణమని ఉక్రెయిన్‌ పేర్కొంది. అయితే, ప్లాంటు నుంచి న్యూక్లియర్‌ రేడియేషన్‌ బయటకు రావడం లేదని రెండు దేశాలూ తెలిపాయి.

మంటలను సోమవారానికల్లా ఆర్పివేసినట్లు రష్యా ప్రకటించింది. జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంటు ఉక్రెయిన్‌లో ఉంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా ఈ ప్లాంటును 2022లోనే తన అధీనంలోకి తీసుకుంది.

అప్పటి నుంచి అక్కడ విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. అణు రియాక్టర్లను కోల్డ్‌ షట్‌డౌన్‌లో పెట్టారు. కాగా, జపోరిజియా ప్లాంటులో మంటలకు ముందు అక్కడ కొన్ని పేలుళ్లు సంభవించాయని అక్కడే విధుల్లో ఉన్న ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) ప్రతినిధులు తెలిపారు.

Updated Date - Aug 13 , 2024 | 04:37 AM