Share News

Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు షాకిచ్చిన కోర్టు.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలపై

ABN , Publish Date - Aug 29 , 2024 | 07:48 PM

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం (ఆగస్టు 29) తిరస్కరించింది. దీనిపై బీజేపీ నేత ఆయనపై పరువునష్టం కేసు పెట్టారు. దీనిని శశి థరూర్ కోర్టులో సవాలు చేశారు.

 Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు షాకిచ్చిన కోర్టు.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలపై
Delhi High Court shocks to Shashi Tharoor

ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi)పై శశిథరూర్(Shashi Tharoor) చేసిన అవమానకర వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు గట్టి షాకిచ్చింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై దాఖలైన పరువు నష్టం కేసు విచారణను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో పాటు కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో పాటు గతంలో ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేయాలని ఆదేశించింది. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఏంటి విషయం

వాస్తవానికి కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ 2018 సంవత్సరంలో ప్రధాని మోదీని 'శివలింగంపై తేలు' అని వ్యాఖ్యానించారు. శశిథరూర్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ థరూర్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ తనపై వేసిన పరువు నష్టం కేసును కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ కేసులో దిగువ కోర్టులో జరుగుతున్న విచారణలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. అంతేకాదు 2019 ఏప్రిల్ 27న కింది కోర్టు శశిథరూర్‌కు జారీ చేసిన సమన్లపై కూడా హైకోర్టు స్టే విధించింది. అయితే ఇప్పుడు కోర్టు శశిథరూర్ పిటిషన్‌ను తిరస్కరించింది. స్టేను కూడా ఎత్తివేసింది.


థరూర్

మోదీ శివలింగంపై కూర్చున్న తేలులాంటివాడని ఓ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఓ జర్నలిస్టు చెప్పారని శశిథరూర్ అన్నారు. మీరు వాటిని మీ చేతితో తీసివేయలేరు. వాటిని చెప్పులతో కొట్టలేరు. తేలును తాకేందుకు ప్రయత్నిస్తే కుట్టిస్తేయని, శివలింగాన్ని చెప్పుతో కొడితే విశ్వాసంలోని పవిత్ర సూత్రాలన్నీ బలహీనపడతాయని థరూర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. థరూర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసాయని అన్నారు.


భక్తుల మనోభావాలను

రాజీవ్ బబ్బర్ తన ఫిర్యాదులో శివ భక్తుడినని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో థరూర్ కోట్లాది మంది శివ భక్తుల మనోభావాలను విస్మరించి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారతదేశంలో అనేక మంది భక్తుల ఆగ్రహానికి కారణమైందన్నారు. దేశం వెలుపల ఉన్న శివ భక్తులందరి మనోభావాలను దెబ్బతీసిందని వెల్లడించారు. దీంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 499 (పరువు నష్టం), 500 (పరువునష్టానికి శిక్ష) కింద కాంగ్రెస్ ఎంపీపై ఫిర్యాదు దాఖలైంది.


ఇవి కూడా చదవండి:

Smriti Irani: ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి

Heavy Rains : వాతావరణ శాఖ కీలక ప్రకటన.. మరో మూడ్రోజులు వర్షాలు


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..


Read More National News and Latest Telugu News

Updated Date - Aug 29 , 2024 | 07:50 PM