Share News

Delhi : అదానీ ప్రాజెక్టులను విమర్శించారని ఎన్జీవో ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ రద్దు

ABN , Publish Date - Jul 12 , 2024 | 03:28 AM

అదానీకి మంజూరు చేసిన ప్రాజెక్టుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని విమర్శించిన ఓ ఎన్జీవోకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది.

Delhi : అదానీ ప్రాజెక్టులను విమర్శించారని ఎన్జీవో ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ రద్దు

న్యూఢిల్లీ, జూలై 11: అదానీకి మంజూరు చేసిన ప్రాజెక్టుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని విమర్శించిన ఓ ఎన్జీవోకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. సదరు సంస్థకు ఆన్‌లైన్‌లో రద్దు విషయాన్ని తెలియజేసింది.

సెంటర్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ అకౌంటబులిటీ (సీఎ్‌ఫఏ) అనే సంస్థ దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పాత్రను.. అభివృద్ధి, మానవ హక్కులు, పర్యావరణం, తదితర రంగాల్లో వాటి ప్రభావాన్ని పర్యవేక్షించడంతో పాటు విశ్లేషణ చేస్తుంది.

గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో అదానీ గ్రూప్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక ఆర్థిక మండలికి మంజూరు చేసిన అదనపు ప్రాజెక్టుల వల్ల పర్యావరణం కలుషితమవుతుందని సీఎ్‌ఫఏ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక వెల్లడించిన కొన్ని రోజులకే సీఎ్‌ఫఏ.. ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. కేంద్రం నుంచి ఇంకా ఉత్తర్వులు రాలేదని, ఆన్‌లైన్‌లో ఈ విషయాన్ని తెలియజేశారని సీఎ్‌ఫఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.

Updated Date - Jul 12 , 2024 | 03:28 AM