Share News

Police Raid,: ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 944 మంది అదుపులోకి

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:50 AM

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం రేపాయి. నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ విక్రయం,

Police Raid,: ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 944 మంది అదుపులోకి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం రేపాయి. నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ విక్రయం, వినియోగం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు 325 ప్రదేశాల్లో దాడులు నిర్వహించి.. ఏకంగా 944 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకు ఏకధాటిగా 12 గంటలపాటు ఈ దాడులు కొనసాగాయి. ఢిల్లీ అదనపు పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ భాటియా నేతృత్వంలో నిర్వహించిన ఈ దాడుల్లో 108.93 గ్రాముల హెరాయిన్‌, 66.28 కిలోల గంజాయితోపాటు 1100 గ్రామాలు చరస్‌, 16 గ్రాముల ఎండీఎంఏ పట్టుబడ్డాయి.

Updated Date - Sep 05 , 2024 | 05:50 AM