Share News

Delhi : పాక్‌ భూభాగంలో పడ్డ భారత నిఘా డ్రోన్‌

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:44 AM

భారత సైన్యానికి చెందిన నిఘా డ్రోన్‌ ఒకటి అదుపు తప్పి పాకిస్థాన్‌ భూభాగంలో పడిపోయింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో నిఘా కోసం వినియోగిస్తున్న ఆ డ్రోన్‌ ...

Delhi : పాక్‌ భూభాగంలో పడ్డ భారత నిఘా డ్రోన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 23: భారత సైన్యానికి చెందిన నిఘా డ్రోన్‌ ఒకటి అదుపు తప్పి పాకిస్థాన్‌ భూభాగంలో పడిపోయింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో నిఘా కోసం వినియోగిస్తున్న ఆ డ్రోన్‌ శుక్రవారం ఉదయం 9.30గంటల సమయంలో సాంకేతిక లోపంతో, పొరపాటున సరిహద్దు రేఖకు ఆవల, పాకిస్థాన్‌లోని నికియాల్‌ సెక్టార్‌లో పడిపోయింది.

ఈ డ్రోన్‌ను పాక్‌ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై భారత సైనికాధికారులు పాకిస్థాన్‌లోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌(డీజీఎంవో) స్థాయి అధికారులతో సంప్రదింపులు జరపునున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

2022లో భారత క్షిపణిని పరీక్షిస్తుండగా సాంకేతిక లోపం కారణంగా అది పాక్‌ భూభాగంలోకి వెళ్లి పడిన సంగతి తెలిసిందే. అప్పుడు పాకిస్థాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల భారత వైమానిక దళానికి చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తి రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఎయిర్‌ స్టోన్‌ను జారవిడిచింది. దీంతో, బాంబు పేలినట్లుగా భారీ శబ్దం వచ్చింది.

Updated Date - Aug 24 , 2024 | 03:44 AM