Share News

DGCA : విమానం నడిపిన అర్హతల్లేని పైలట్లు

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:07 AM

తగిన శిక్షణ, అర్హతల్లేని పైలట్లతో విమానాన్ని నడిపించినందుకు టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిర్‌ ఇండియా సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) రూ.90 లక్షల జరిమానా విధించింది.

DGCA : విమానం నడిపిన అర్హతల్లేని పైలట్లు

  • ఎయిర్‌ ఇండియాకు రూ.90 లక్షల జరిమానా

న్యూఢిల్లీ, ఆగస్టు 23: తగిన శిక్షణ, అర్హతల్లేని పైలట్లతో విమానాన్ని నడిపించినందుకు టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిర్‌ ఇండియా సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) రూ.90 లక్షల జరిమానా విధించింది.

ఇందుకు బాధ్యులను చేస్తూ ఎయిర్‌ ఇండియా ఆపరేషన్స్‌ విభాగం డైరెక్టర్‌ పంకుల్‌ మాథుర్‌కు రూ.6 లక్షలు, శిక్షణ విభాగం డైరెక్టర్‌ మనీష్‌ వాసవాడాకు రూ.3 లక్షల జరిమానా వేసింది. అర్హత లేని పైలట్లతో విమానాన్ని నడిపించినట్టు జులై 10న ఎయిర్‌ ఇండియాయే స్వచ్ఛందంగా ఓ నివేదిక రూపంలో డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లింది. దాని ఆధారంగా దర్యాప్తు జరిపిన డీజీసీఏ ఇది తీవ్రమైన విషయమని, భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ జరిమానా వేసింది.

Updated Date - Aug 24 , 2024 | 04:07 AM