Share News

NEET Exam: నీట్ పేపర్ లీకేజీపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

ABN , Publish Date - Jun 20 , 2024 | 08:38 PM

నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage) వ్యవహారంపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి(Central Education Minister) ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

NEET Exam: నీట్ పేపర్ లీకేజీపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage) వ్యవహారంపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి (Central Education Minister) ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి పట్నా పోలీసులను పూర్తిస్థాయి రిపోర్ట్ అడిగినట్లు ఆయన వెల్లడించారు. దోషులను వదిలిపెట్టేది లేదని, వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ ఘటన వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. నీట్ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీని వేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. NTA నిర్వహించే పరీక్ష విధానం మెరుగుపరిచేందుకు "జీరో ఎర్రర్ పరీక్ష" నిర్వహించేలా ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. విద్యార్థులు మన దేశ భవిష్యత్తు అని నీట్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు.

Updated Date - Jun 20 , 2024 | 08:38 PM