Share News

Dibrugarh Express accident: రైలు ప్రమాదానికి ముందు భారీ పేలుడు..!

ABN , Publish Date - Jul 18 , 2024 | 07:59 PM

ఉత్తరప్రదేశ్‌లో చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Dibrugarh Express accident: రైలు ప్రమాదానికి ముందు భారీ పేలుడు..!

లఖ్‌నవూ, జులై 18: ఉత్తరప్రదేశ్‌లో చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే రైలు బోగీలు పట్టాలు తప్పే ముందు తనకు పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు లోక్‌ పైలెట్ స్పష్టం చేశారు. ఇక ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని మొత్తం 23 బోగీల్లో 21 పట్టాలు తప్పాయి. ఝులాహి రైల్వేస్టేషన్‌కు కొద్ది దూరంలోనే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు రైల్వే శాఖ ఇప్పటికే ఆదేశించింది. అలాగే నష్ట పరిహారాన్ని సైతం ప్రకటించింది.

Also Read: pocharam srinivas reddy: అందుకే సంబురాలు చేసుకుంటున్నాం

Also Read: PoK: భారత్ కోసం.. ‘పాక్ ఆర్మీ’ ఉగ్రవాద శిక్షణ


ఇక రైలు ప్రమాదం చోటు చేసుకోవడంతో.. చండీగఢ్ - దిబ్రూగఢ్ రైలు మార్గంలో పలు రైళ్లను రద్దు చేశామని.. అలాగే మరొకొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు ఈశాన్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహయం అందించాలని ఆదేశించారు.

Also Read: Maharastra: లండన్‌ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’.. రేపటి నుంచి ప్రదర్శన

Also Read: Maharastra: లండన్‌ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’.. రేపటి నుంచి ప్రదర్శన


మరోవైపు రైలు ప్రమాద ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయన్నారు. అందుకు బాధ్యత వహిస్తూ.. ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే సొంత ప్రచారం కోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని వీరిద్దరు వదులుకోరని ఈ సందర్భంగా ఖర్గే వ్యంగ్యంగా అన్నారు.

Also Read:India-Pakistan Border: తుపాకులు, బులెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

Also Read: Telangana: చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!


భారతీయ రైల్వేలో అనేక లోపాలున్నాయని.. వాటికి ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఖర్గే తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల క్రితం పశ్చిమ బెంగాల్‌లో కాంచన్ గంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ ఢీ కొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారని మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 18 , 2024 | 07:59 PM