Share News

Lalu Prasad: లాలూ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి

ABN , Publish Date - Sep 21 , 2024 | 05:26 AM

తక్కువ ధరకు భూములు తీసుకొని వాటి యజమానులకు ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ను సీబీఐ ప్రాసిక్యూట్‌ చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.

Lalu Prasad: లాలూ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి

  • భూములకు ఉద్యోగాల కేసుపై ముందుకు సాగనున్న సీబీఐ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: తక్కువ ధరకు భూములు తీసుకొని వాటి యజమానులకు ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ను సీబీఐ ప్రాసిక్యూట్‌ చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు. 2004-09 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు బహుమతులుగా భూములను పొందడం, వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా లబ్ధి పొందారని, ప్రత్యుపకారంగా వాటి యజమానులకు రైల్వే ఉద్యోగాలు ఇచ్చారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.


బిహార్‌లో భూములు తీసుకొని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ కేంద్రంగా ఉన్న వెస్ట్‌ సెంట్రల్‌ జోన్‌లో గ్రూపు-డి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించింది. ఈ కేసులో లాలు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరో 30మందికిపైగా నిందితులు ఉన్నారు. రాష్ట్రపతి అనుమతి ఇచ్చిన పత్రాన్ని సీబీఐ శుక్రవారం ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టుకు సమర్పించింది.

Updated Date - Sep 21 , 2024 | 05:26 AM