Share News

Heatwave alert in India: హీట్‌వేవ్ యూనిట్లు ప్రారంభించండి.. అధికారులను ఆదేశించిన మంత్రి జేపీ నడ్డా

ABN , Publish Date - Jun 20 , 2024 | 08:59 AM

ఉత్తర భారత దేశాన్ని తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda) పరిస్థితిపై సమీక్షించారు. హీట్ వేవ్ పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఆసుపత్రులు సిద్ధంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

Heatwave alert in India: హీట్‌వేవ్ యూనిట్లు ప్రారంభించండి.. అధికారులను ఆదేశించిన మంత్రి జేపీ నడ్డా

ఢిల్లీ: ఉత్తర భారత దేశాన్ని తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda) పరిస్థితిపై సమీక్షించారు. హీట్ వేవ్ పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఆసుపత్రులు సిద్ధంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక హీట్‌వేవ్ యూనిట్లను ప్రారంభించాలని నడ్డా స్పష్టం చేశారు. "చాలా మంది వలస కూలీలకు శారీరక శ్రమ ఉంటుంది. కాబట్టి వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొందరు రోగులు ఆసుపత్రికి చేరుకోవడంలో ఆలస్యం అవుతుండటం వల్ల మరణిస్తున్నారు. ఈ కారణంతో మరణిస్తున్న వారు 60-70 శాతందాకా ఉన్నారు. చికిత్స ఆలస్యమైతే, మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది"అని జేపీ నడ్డా అన్నారు.


ఢిల్లీలో ఆగమాగం..

మండే ఎండలు, భీకరమైన వడగాలులు, తీవ్రమైన నీటి కొరత ఢిల్లీ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండలు, వడగాలులతో ఢిల్లీలో గడిచిన వారం రోజుల్లో 20 మంది చనిపోయారు. ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడాలో ఒక్కరోజులోనే 10మంది మృత్యువాత పడ్డారు. వడదెబ్బతో ఢిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో మే 27 నుంచి 45 మంది చేరారు. ఇక్కడ రెండు రోజుల్లోనే 9 మంది చనిపోయారు. సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రిలో బుధవారం ఒక్కరోజే ఐదుగురు చనిపోయారు.

ఈ హాస్పిటల్‌లో మొత్తంగా తొమ్మిది మంది చనిపోయారు. ఎల్‌ఎన్‌జే ఆస్పత్రిలో ఏడు రోజుల్లో ఇద్దరు మృతిచెందారు. ఆస్పత్రుల్లో చేరకుండా చనిపోతున్న వృద్ధుల సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో వడదెబ్బతో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jun 20 , 2024 | 08:59 AM